
మనం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. అందులో ముఖ్యంగా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తింటుండాలి. పండ్లు, కూరగాయలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నట్లయితే…మీరు పండ్లు, కూరగాయలకు సంబంధించి వ్యాపారం కూడా ప్రారంభించవచ్చు. సాధారణంగా పండ్లు, కూరగాయల వ్యాపారం చేయాలనుకుంటే వారికి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పండించి అమ్మడం, రెండవది ఇతర మార్గాల్లో తీసుకువచ్చి అమ్మడం. పండ్లు కూరగాయల వ్యాపారాలు ఎలా చేయాలి. ఏవిధంగా లాభాలను అర్జించవచ్చు.. ఎంత పెట్టుబడి పెట్టాలి.. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు తెలుసుకుందాం.
కూరగాయలు, పండ్లను విక్రయించాలంటే ప్రత్యేకంగా దుకాణం తెరవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అంతా కూడా ఆన్ లైన్ ద్వారానే విక్రయాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు మొదట్లో వెబ్ సైట్ తెరచి దాని ద్వారా కూరగాయలు, పండ్లను అవసరం లేదు. మీరు మీ ఇంటి చుట్టూ ఉన్న వ్యక్తులకు కావాల్సిన కూరగాయలను ఇంటి వద్దకు తీసుకెళ్లి అందిస్తే సరిపోతుంది. మీ ఇంట్లోనే పండ్లు, కూరగాయలను ఉంచండి. మీ ఇరుగు పొరుగువారికి అమ్మండి. ఇలా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతున్నప్పుడు, మీరు వారికి కూరగాయలు, పండ్లను సరఫరా చేయడానికి క్యాటరర్లు, హోటల్‌లు, ఇతర కంపెనీలతో ఒప్పందం చేసుకోవచ్చు.
మీరు పండ్లు, కూరగాయల సహాయంతో డబ్బు సంపాదించాలనుకుంటే, మీరు బంగాళాదుంప, అరటి వంటి అనేక రకాల పండ్లు, కూరగాయలతో చిప్స్ తయారు చేయవచ్చు. ప్రారంభంలో సింగిల్ చిప్‌లను తయారు చేసి విక్రయించండి. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. అయితే ఇందులో మంచి విజయం సాధించక పోయినా పెద్దగా నష్టపోయే అవకాశం ఉండదు. మీరు తయారు చేసిన చిప్స్ కు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లయితే మీరు దానిని పెద్దగా విస్తరించవచ్చు. అప్పుడు దాని స్వంత బ్రాండ్‌తో మీరు విక్రయించే అవకాశం ఉంటుంది.
చిప్స్ లాగా, పండ్లు, కూరగాయల సహాయంతో ప్రారంభించే వ్యాపారం ఊరగాయ. మీరు మామిడికాయల నుండి నిమ్మకాయలు, ముల్లంగి, క్యారెట్, మిరపకాయలు మొదలైన వాటి వరకు ఊరగాయలను తయారు చేసి అమ్మవచ్చు. రుచికరమైన పచ్చళ్లను తయారు చేయడంలో మీరు విజయం సాధిస్తే మీ వ్యాపారం పెరుగుతుంది.
మార్కెట్ నుంచి పండ్లు, కూరగాయలు తెచ్చి కట్ చేసి ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు. నాణ్యమైన కూరగాయలకు గిరాకీ బాగుంటుంది. మీరు బొప్పాయి, క్యారెట్, ఉల్లిపాయలు, వెల్లుల్లి మొదలైన అనేక కూరగాయలను కట్ చేసి ప్యాక్ చేసి అమ్మవచ్చు.
ఇంట్లో స్థలం ఉండి, వ్యవసాయంపై ఆసక్తి ఉంటే సేంద్రియ వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం సేంద్రియ కూరగాయలకు డిమాండ్ చాలా పెరిగింది. మీరు ఇంటి టెర్రస్ పై కూడా దీన్ని ప్రారంభించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి