AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BMW M5: కళ్లు చెదిరే లుక్ తో బీఎండబ్ల్యూ కారు.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!

సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ అందరూ కార్లను ఇష్టపడతారు. ధనికులందరూ తప్పనిసరిగా వీటిని ఉపయోగిస్తారు. మార్కెట్ లోకి ఏ కొత్త మోడల్ వచ్చినా కొనుగోలు చేయాలని చూస్తారు. కారు అనేది సమాజంలో స్టేటస్ సింబల్ గా మారింది. ప్రస్తుతం మధ్య తరగతి ప్రజలు కూడా కొనుగోలు చేయగలిగే ధరలో కార్లు విడుదలవుతున్నాయి.

BMW M5: కళ్లు చెదిరే లుక్ తో బీఎండబ్ల్యూ కారు.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!
Bmw M5
Nikhil
|

Updated on: Nov 25, 2024 | 8:32 PM

Share

కార్లల్లో ధనికులు మాత్రమే కొనుగోలు చేసే కొన్ని బ్రాండ్లు ఉన్నాయి. వాటిలో బీఎండబ్ల్యూ ఒకటి. ఇష్టమైన కారు బ్రాండ్ ఏమిటంటే చాలామంది దీని పేరే చెబుతారు. సామాన్యులకు కూడా ఈ పేరు సుపరిచితం కావడం విశేషం. ఈ నేపథ్యంలో బీఎండబ్ల్యూ మన దేశంలో 2025 ఎం5 కారును విడుదల చేసింది. దీని ధర రూ.1.9 కోట్లు (ఎక్స్ షోరూమ్) కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది జూన్ లో ఎం5 కారును బీఎండబ్ల్యూ విడుదల చేసింది. ప్రస్తుతం మనదేశంలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ కారు సరికొత్త డిజైన్ తో ఆకట్టుకుంటోంది.

ముందు భాగంలో ట్విన్ హెడ్ లైట్లు, ఐకానిక్ కిడ్నీ గ్రిల్ ఏర్పాటు చేశారు. ఎల్ ఈడీ హెడ్ లైట్లు, గ్రిల్ పై ఎంఎస్ బ్యాడ్జి ఉంది. ముందు, వెనుక ఉండే చక్రాలతో సహా అన్ని బాడీ ప్యానెల్ ను రీడిజైన్ చేశారు. కార్బర్ ఫైబర్ రూఫ్ తో ఎం5 అందుబాటులోకి వచ్చింది. పనోరమిక్ సన్ రూఫ్ కలిగిన మోడళ్లతో పోల్చితే 30 కిలోల బరువు తగ్గుతుంది. ఎం వెనుక స్పాయిలర్, ట్విన్ ఎగ్జాస్ట్ పైపులు, 20 అంగుళాల తేలికపాటి అల్లాయ్ వీల్స్ అదనపు ప్రత్యేకతలు. కారు లోపలి భాగాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. రెడ్ మార్కర్ తో మూడు స్పోక్ ప్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఏర్పాటు చేశారు. యాంబియంట్ లైటింగ్, ఇల్యూమినేటేడ్ ఎం 5 లోగోతో కూడిన మల్టీ ఫంక్షనల్ సీట్లు, బోవర్స్, విల్కిన్స్ 18 స్పీకర్ సౌండ్ సిస్టమ్ అమర్చారు.

కారులో 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ నుంచి 585 బీహెచ్పీ పవర్, 750 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. అలాగే దీనిలోని ఎలక్ట్రిక్ మోటారు 194 బీహెచ్ పీ, 280 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ కు 8 స్పీడ్ ఆటో మేటిక్ ట్రాన్స్ మిషన్ జత చేశారు. కేవలం 3.5 సెకన్లలో సున్నా నుంచి వంద కిలోమీటర్ల స్పీడ్ ఎత్తుకుంటుంది. గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల స్పీడ్ తో పరుగులు పెడుతుంది. ఎం డ్రైవర్ ప్యాకేజీని ఎంచుకుంటే 305 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. బీఎండబ్ల్యూ ఎం 5 ఆకట్టుకునే రంగులలో అందుబాటులో ఉంది. నాన్ మెటాలిక్ ఆల్పైన్ వైట్, బ్లాక్ సపైర్, సోఫిస్టో గ్రే, బ్రూక్లిన్ గ్రే, ఫైర్ రెడ్, కార్బన్ బ్లాక్, ఐల్ ఆఫ్ మ్యాన్ గ్రీన్, స్టార్మ్ బే, మెరినా బే బ్లూ వంటి మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అలాగే ఇంటీరియల్ రెడ్, బ్లాక్, కైలామి ఆరెంజ్, సిల్వర్ స్టోన్/ బ్లాక్, ఆల్ – బ్లాక్ వంటి కాంబినేషన్లలో విడుదల చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..