AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చదివింది ఏడో తరగతి.. సంపాదన మాత్రం ఏడాదికి రూ.10లక్షలు.. ఎలానో తెలిస్తే..

డబ్బు సంపాదించడానికి కేవలం చదువు మాత్రమే ముఖ్యం కాదు. తెలివితేటలు, నైపుణ్యం ఉంటే ఎంత డబ్బు అయినా సంపాదించవచ్చని ఈ సామాన్యుడు నిరూపించాడు. చాలా మంది సక్సెస్‌ పీపుల్స్ ఎలాంటి విద్యార్హతలు లేకుండానే వ్యాపార ప్రపంచలో విజయం సాధించారు. వారే ఇప్పుడు కోట్లు సంపాధిస్తున్నారు. మనం ఇప్పుడు చెప్పుకో బోయే వ్యక్తి కూడా అలాంటి కోవకు చెందిన వాడే. కేవలం ఏడో తరగతి చదివిన ఈ వ్యక్తి ప్రస్తుతం ఏడాది రూ.10లక్షలు సంపాధిస్తున్నాడు. అతని విజయానికి కారణం ఏంటో తెలుసుకుందాం పదండి.

చదివింది ఏడో తరగతి.. సంపాదన మాత్రం ఏడాదికి రూ.10లక్షలు.. ఎలానో తెలిస్తే..
Heep Farming Business
Anand T
|

Updated on: Feb 07, 2026 | 6:49 PM

Share

ప్రస్తుత పోటీ ప్రపంచంలో మన చదువుకు తగ్గ ఉద్యోగం దొరకడం అనేకి పెద్ద కష్టంగా మారిపోయింది. దీంతో చాలా మంది చదివిన విద్యకు, వారు చేస్తున్న పనికి ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అయినా ఆర్థిక ఇబ్బందులతో జీవతాన్ని నెట్టుకొస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం కేవలం ఏడో తరగతి చదివి.. ఏడాదికి లక్షల్లో సంపాధిస్తున్నాడు. అవును మీరు వింటున్నది నిజమే.. మండ్య జిల్లాలోని బసవనలు గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి ఏడో తరగతి మాత్రమే చదివాడు. అందుకే, ఎటువంటి సంకోచం లేకుండా అతను పశుపోషణను జీవనాదారంగా ఎంచుకున్నాడు. వాటి పెంపకం ద్వారా ఏడాది లక్షల్లో సంపాధిస్తున్నాడు.

మల్లేష్ 7వ తరగతి చదువుకున్నప్పటికీ, ఇప్పుడు అతని వద్ద సుమారు 800 కి పైగా గొర్రెలు ఉన్నాయి. వాటి ద్వారా అతని సంవత్సరానికి రూ. 10 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాడు. గొర్రెలకు అవసరమైన మేతను తీసుకురావడానికి అతను ప్రతిరోజూ 100 కిలోమీటర్లకు పైగా నడిచి వెళ్తాడు. అతని దగ్గర 5 ఎకరాల సొంత భూమి కూడా ఉంది. కేవలం అతని వర్షాకాలంలో మాత్రమే పరిమిత మొత్తంలో పొలం సాగు చేస్తాడు. అయితే, వ్యవసాయం కంటే గొర్రెల పెంపకం అతని ప్రధాన ఆదాయ వనరుగా చెబుతున్నాడు.

ఈ గొర్రెలను అమ్మడం ద్వారా అతను ప్రతి సంవత్సరం సుమారు 10 లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తాడు. అతను ఒక గొర్రెను దాదాపు 7000 వేల రూపాయలకు అమ్ముతాడు. మల్లేష్ తన గొర్రెలను మైసూర్, మాండ్య, చామరాజనగర్, హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో విక్రయిస్తాడు. పండుగలు, వివాహాల సమయంలో గొర్రెలకు అధిక డిమాండ్ ఉంటుంది, ఇది అతనికి భారీ లాభాలను ఆర్జించి లక్షల్లో ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. కృషి, ఓర్పు, ఆసక్తి ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధ్యమే అనే దానికి బసవనలు గ్రామానికి చెందిన మల్లేష్ ఒక సజీవ నిదర్శనం.

మరిన్ని బిజెనెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.