5G Cars: త్వరలో అందుబాటులోకి 5జీ కార్లు.. అవి ఎలా పనిచేస్తోయో తెలుసుకోండి..

5G Cars: ఇప్పటి దాకా సెల్ ఫోన్లలో 5జీ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు చర్చంతా 5జీ కార్లపై జరుగుతోంది. అసలు ఈ 5జీ కార్లు అంటే ఏమిటి. అవి ఎలా భవిష్యత్ రవాణా అవసరాలకు అనుగుణంగా..

5G Cars: త్వరలో అందుబాటులోకి 5జీ కార్లు.. అవి ఎలా పనిచేస్తోయో తెలుసుకోండి..
5g Cars
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 18, 2022 | 2:07 PM

5G Cars: ఇప్పటి దాకా సెల్ ఫోన్లలో 5జీ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు చర్చంతా 5జీ కార్లపై జరుగుతోంది. అసలు ఈ 5జీ కార్లు అంటే ఏమిటి. అవి ఎలా భవిష్యత్ రవాణా అవసరాలకు అనుగుణంగా ఉంటాయా.. అవి ఎలాంటి మార్పులను తీసుకొస్తాయి అనే ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం. రియల్ టైమ్ సమాచార మార్పిడి, క్లౌడ్ కార్ కమ్యూనికేషన్ సాంకేతికతలతో కార్లు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం 2025 నాటికి ప్రతి నాలుగా కార్లలో ఒకటి 5జీ సాంకేతికత ఆధారంగా నడుస్తాయని కౌంటర్ పాయింట్ సంస్థ చేసిన రీసెర్చ్ ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతం 2021లో కనెక్టెడ్ కార్లలో 90 శాతం 4జీ సాంకేతికతతో నడుస్తున్నాయి.

రానున్న కాలంలో 5జీ సాంకేతికత కార్ల రాకతో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలుస్తోంది. ప్రస్తుత గ్లోబల్ లీడర్లు తమ భవిష్యత్ అవసరాలకోసం వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారని రీసెర్చ్ ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతం కార్ల తయారీ కంపెనీలను వేదిస్తున్న సెమీకండక్టర్ల కొరత, ఉత్పత్తి నష్టాలు, వ్యయ ద్రవ్యోల్బణం, సరుకు రవాణా అంతరాయాలు వంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనుసంధానించబడిన కార్ మార్కెట్ 2021లో వాటిని దాటుకుంటూ ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఫిబ్రవరి 15న వచ్చిన పరిశోధన వివరాల ప్రకారం అమెరికా, చైనా, జర్మనీ, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలలో 5జీ టెలిమాటిక్స్ కంట్రోల్ యూనిట్‌ల ప్రవేశంతో పాటుగా 4జీ సాంకేతికత కలిగిన కార్లు పరిపక్వతకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు కార్ల డిజిటలైజేషన్ వైపు ప్రపంచవ్యాప్తంగా అడుగులు వేగంగా పడుతున్నాయి. చాలా దేశాలు ప్రస్తుతం 4జీ సాంకేతికతను తమ దేశాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం.. తరువాతి తరం టెలికాం టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న తరుణంలో అత్యాధునిక కార్ల వినియోగం, తయారీ వైపు ముందడుగులు పడుతున్నాయి. ఇప్పటికే 2021లో దీనికి సంబంధించి ఆటోమోటివ్ పరిశ్రమలో BMW- iX మోడల్ మెుదటి 5జీ సాంకేతికత ఆదారిత కారుగా నిలిచింది. దీనిని మెుదటగా గత నవంబర్‌లో జర్మనీలో ప్రారంభించబడింది. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలకోసం షిప్‌మెంట్‌లు జరిగాయి. దీనిని విజయవంతం చేసేందుకు నెట్ వర్క్ అవసరమైన సాంకేతికత, ప్రభుత్వాల సహకారం ఎంతగానో ముఖ్యమని ఆ రంగ నిపుణులు అంటున్నారు. Chevrolet, Geely, Buick, Ford, BMW కంపెనీలు ఇందుకు సంబంధించి కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తున్నాయని తెలుస్తోంది.

ఇవీచదవండి..

Rakesh Jhunjhunwala: ఆ రంగం కంపెనీలపై బులిష్‌గా ఉన్న రాకేశ్ ఝున్ ఝున్ వాలా.. నిజజీవిత ఉదాహణ వెల్లడి..

UPI Payments: ఆ దేశంలో భారత్ UPI సేవలు.. ఆ అయిదు అంశాలే కీలకం..