AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bikes: ఎట్టకేలకు భారత్‌లో ఆ అడ్వెంచర్ బైక్ రిలీజ్.. ఇక బుల్లెట్ బండికి పోటీ తప్పదంతే..!

భారతదేశంలోని యువత ఇటీవల కాలంలో సూపర్ బైక్స్‌ను ఇష్టపడుతున్నారు. సుప్రీం రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అనుభూతి పొందేందుకు ధర ఎక్కువైన పర్లేదని టాప్ అడ్వెంచరస్ బైక్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ లాంగ్ రైడ్స్‌కు అనువుగా ఉన్నాయి. అయితే ఈ బైక్స్‌కు పోటినిచ్చేలా ప్రముఖ కంపెనీ యెజ్డీ అడ్వెంచర్ బైక్‌ను భారత్‌లో రిలీజ్ చేసింది.

Bikes: ఎట్టకేలకు భారత్‌లో ఆ అడ్వెంచర్ బైక్ రిలీజ్.. ఇక బుల్లెట్ బండికి పోటీ తప్పదంతే..!
2025 Yezdi Adventure
Nikhil
|

Updated on: Jun 05, 2025 | 6:30 PM

Share

క్లాసిక్ లెజెండ్స్ ఆవిష్కరించిన 2025 యెడ్జీ అడ్వెంచర్ భారతదేశంలో దాని ప్రసిద్ధ డ్యూయల్ స్పోర్ట్ మోటార్ సైకిల్‌కు రిఫ్రెష్ వెర్షన్‌గా నిలిచింది. మెకానికల్ స్పెసిఫికేషన్లు మారనప్పటికీ తాజా మోడల్ అనేక కాస్మెటిక్, ఫంక్షనల్ అప్‌డేట్స్‌ను ఈ బైక్స్ ధరలు రూ. 2.14 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై రూ.2.16 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. ఈ బైక్స్ గత జెనరేషన్ మోడల్ ధరలు అయిన రూ. 2.16- రూ.2.20 లక్షల శ్రేణి కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450కు పోటీగా రిలీజ్ చేశారు. హిమాలయన్ ధర రూ. 2.85 లక్షల నుంచి రూ. 2.98 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 

2025 యెడ్జీ అడ్వెంచర్ సరికొత్త ఎల్ఈడీ హెడ్ర్యంప్ సెటప్ అప్‌డేట్‌తో వస్తుంది. రౌండెడ్ లైట్‌తో ప్రొజెక్టర్ యూనిట్‌ను కలిగి ఉన్న ఈ కొత్త డిజైన్ నిలిపివేసిన బీఎండబ్ల్యూ ఎఫ్-800 జీఎస్ నుంచి స్పష్టమైన ప్రేరణను పొందింది. యెజ్జి అడ్వెంచర్ విలక్షణమైన, దూకుడుగా ఉండే ఇనీషియల్ ప్రొఫైల్‌ను ఇస్తుంది. టెయిల్ సెక్షన్ కూడా గత సెటప్ స్థానంలో ట్విన్ రౌండ్ ఎల్ఈడీ యూనిట్లతో మేక్ఓవర్‌తో వస్తుంది. అలాగే టిల్ట్- అడ్జస్టబుల్ విండ్రన్ కారణంగా సుదూర రైడింగ్కు మెరుగైన విండ్ ప్రొటెక్షన్‌తో పాటు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుంది. ముందు మడ్‌గార్డ్ స్టైలిష్ లుక్ కోసం సెట్ చేశారు.  

ఇవి కూడా చదవండి

2025 యెజ్డీ అడ్వెంచర్ ఇతర ఫీచర్లు గత వెర్షన్ మాదిరిగానే ఉన్నాయి. 334 సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఆల్ఫా-2 ఇంజిన్‌తో శక్తిని పొందుతుంది. ఈ బైక్ 29.6 హెచ్‌పీ, 29.8 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ సిక్స్ స్పీడ్ గేర్బాకాతో వస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనోషాక్ ద్వారా సస్పెన్షన్‌తో వస్తుంది అలాగే బ్రేకింగ్ విధుల కోసం డిస్క్ బ్రేక్లు ఈ బైక్ ప్రత్యేకత. స్విచ్ చేసే మోడ్స్‌తో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ సిస్టమ్ రైడర్లను అమితంగా ఆకర్షిస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి