Honda CB300R: హోండా నుంచి సరికొత్త బైక్‌ విడుదల.. ఫీచర్స్‌, ధర వివరాలు..!

Honda CB300R: మార్కెట్లో కొత్త కొత్త బైక్‌లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ బైక్‌లను మార్కెట్లో తీసుకువస్తున్నాయి..

Honda CB300R: హోండా నుంచి సరికొత్త బైక్‌ విడుదల.. ఫీచర్స్‌, ధర వివరాలు..!

Updated on: Jan 12, 2022 | 4:56 PM

Honda CB300R: మార్కెట్లో కొత్త కొత్త బైక్‌లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ బైక్‌లను మార్కెట్లో తీసుకువస్తున్నాయి బైక్‌ తయారీ కంపెనీలు. యువతను ఆకట్టుకునే విధంగా బైక్‌లను తయారు చేస్తున్నాయి కంపెనీలు. ఇక భారత్‌లో హోండా నుంచి 2022 సీబీ300ఆర్‌ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌ కొనుగోలు చేసేందుకు ముందుగా బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే డెలివరీలు ప్రారంభించేందుకు సిద్దమవుతోంది కంపెనీ. హోండా డీలర్‌ షిప్‌ల వద్ద బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మ్యాటీ స్టీల్‌ బ్లాక్‌, పెరల్ స్పార్టన్‌ రెడ్‌ కలరర్లలో అందుబాటులో ఉంచనుంది. దీని ధర రూ.2.77 లక్షలు నిర్ణయించింది కంపెనీ. . బైక్‌కు సమానమైన బాడీ వర్క్‌, ఎల్‌ఈడీ లైట్స్‌, గేర్‌ పొజిషన్‌ ఇండికేటర్‌, ఫిఫ్ట్‌లైట్‌తో కూడిన కొత్త ఎల్‌సీడీ డిప్‌ ప్లేను అందించింది.

హైస్టాండర్డ్స్‌ ఇంజనీరింగ్‌తో పాటు అత్యాధునిక ఫీచర్స్‌ ఉన్నాయి ఉన్నాయని మోటారు సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సీఈవో అతుషి ఒగటా తెలిపారు. డిసెంబ‌ర్ 21 ఇండియా బైక్ వీక్‌లో ఈ కొత్త బైక్‌కు మంచి స్పందన వస్తోందని తెలిపారు.

ఇవి  కూడా చదవండి:

Whatsapp Shortcuts: మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా..? ఈ షార్ట్‌కట్ కీ గురించి తెలుసుకోండి..!

Mobile Airplane Mode: విమాన ప్రయాణంలో ఫోన్‌లను స్విచ్‌ఆఫ్‌, ఫ్లైట్ మోడ్‌లో ఎందుకు పెడతారు..? కారణాలు ఏమిటి..?