Post Office Investment: రూ.5 లక్షల పెట్టుబడితో 15 లక్షల రాబడి.. ఆ పోస్టాఫీస్ పథకంతోనే సాధ్యం

|

Aug 16, 2024 | 5:15 PM

ప్రతి ఇంట్లో బిడ్డ పుట్టడం అంటే ఇంటెళ్లిపాదిగా ఎంతో ఆనందానిచ్చే విషయం. తమకు పుట్టిన పిల్లలకు భవిష్యత్‌లో ఎలాంటి కష్టం రాకూడదని పుట్టినప్పటి నుంచే చాలా మంది ఆర్థిక ప్రణాళికను వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా భవిష్యత్  అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. కొంతమంది పిల్లల పేరు మీద పీపీఎఫ్, సుకన్య వంటి పథకాలలో పెట్టుబడి పెడతారు. మరికొంత మంది అయితే కొంతమంది పిల్లల భవిష్యత్తు కోసం పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ అంటే పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడతారు.

Post Office Investment: రూ.5 లక్షల పెట్టుబడితో 15 లక్షల రాబడి.. ఆ పోస్టాఫీస్ పథకంతోనే సాధ్యం
Post Office
Follow us on

ప్రతి ఇంట్లో బిడ్డ పుట్టడం అంటే ఇంటెళ్లిపాదిగా ఎంతో ఆనందానిచ్చే విషయం. తమకు పుట్టిన పిల్లలకు భవిష్యత్‌లో ఎలాంటి కష్టం రాకూడదని పుట్టినప్పటి నుంచే చాలా మంది ఆర్థిక ప్రణాళికను వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా భవిష్యత్  అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. కొంతమంది పిల్లల పేరు మీద పీపీఎఫ్, సుకన్య వంటి పథకాలలో పెట్టుబడి పెడతారు. మరికొంత మంది అయితే కొంతమంది పిల్లల భవిష్యత్తు కోసం పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ అంటే పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడతారు. పోస్టాఫీసులో 5 సంవత్సరాల ఎఫ్‌డీ బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేటును ఇస్తోంది. ఈ పథకలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.15 లక్షల రాబడి వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ముందుగా 5 సంవత్సరాల పాటు పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్ రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. పోస్టాఫీసు 5 సంవత్సరాల FDపై 7.5 శాతం వడ్డీని ఇస్తోంది. అంటే ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ.7,24,974 అవుతుంది. మీరు ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేయకుండా తర్వాత ఐదేళ్లకు కూడా పెట్టుబడి పెట్టాలి. ఇలా పదేళ్లల్లో 5 లక్షల మొత్తంపై వడ్డీ ద్వారా రూ. 5,51,175 సంపాదిస్తారు. అంటే మీ మొత్తం రూ. 10,51,175 అవుతుంది. అనంతరం 5 సంవత్సరాలకు చేయాలంటే రాబడిని రెండు భాగాలు విభజించి మళ్లీ డిపాజిట్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం 5 లక్షలపై వడ్డీ నుండి మాత్రమే రూ.10,24,149 పొందవచ్చు. ఈ విధంగా మీరు పెట్టుబడి పెట్టిన 5 లక్షలు, 10,24,149 రూపాయలను కలపడం ద్వారా మీరు మొత్తం 15,24,149 రూపాయలు పొందవచ్చు. అయితే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్‌ను రెండుసార్లు మాత్రమే పొడగించే అవకాశం ఉంటుంది.

పోస్ట్ ఆఫీస్ టీడీ వడ్డీ రేట్లు

బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసులలో కూడా మీరు వివిధ పదవీకాల ఎఫ్‌డీల ఎంపికను పొందవచ్చు. వ్యవధి ఆధారంగా వేర్వేరు వడ్డీ రేట్లు ఇస్తారు. ఒక సంవత్సరం డిపాజిట్‌పై 6.9 శాతం, రెండు సంవత్సరాల ఎఫ్‌డీపై 7.0 శాతం వార్షిక వడ్డీ, మూడు సంవత్సరాల ఎఫ్‌డీపై 7.1 శాతం వార్షిక వడ్డీ, ఐదు సంవత్సరాల టీడీపై 7.5 శాతం వార్షిక వడ్డీ అందిస్తారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..