Budget 2023: దేశంలో స్థిరమైన, నిర్భయమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉంది- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొన్ని నెలల క్రితమే అమృత్ మహోత్సవాలు..
దేశం ఆత్మనిర్భర్ భారతంగా ఆవిర్భవిస్తోందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బాధ్యతలు చేపట్టాక ఉభయసభలనుద్దేశించి తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొన్ని నెలల క్రితమే అమృత్ మహోత్సవాలు జరుపుకొన్నామని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల ఉత్సవాలు పూర్తిచేసుకున్న.. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం అని అన్నారు. దేశం ఆత్మనిర్భర్ భారతంగా ఆవిర్భవిస్తోందని..
2047 నాటికి గత పునాదులపై ఆధునికత సువర్ణ అధ్యాయాలతో కూడిన బలమైన దేశాన్ని నిర్మించాలని, స్వావలంబన, మానవతా ప్రాతిపదికన బలమైన దేశాన్ని నిర్మించాలన్నారు. పేద, మధ్యతరగతి, యువత, మహిళలు సహా అన్ని వర్గాల పౌరులు అభివృద్ధి చెందాలి.. సమాజానికి, దేశానికి బాటలు చూపించడంలో యువత, మహిళలు ముందుండాలి.. యువత అందరికంటే రెండడుగులు ముందుండాలి. అభివృద్ధి నిబంధనలు అని అన్నారు. పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ రోజు దేశంలో స్థిరమైన, నిర్భయ, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉంది. ఇది పెద్ద కలలను సాకారం చేయడానికి కృషి చేస్తోంది.
ఆర్టికల్ 370 రద్దు, ట్రిబుల్ తలాక్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. రాబోయే పాతికేళ్లలో వికసిత భారతం దిశగా అడుగులు పడాలి. ప్రపంచమంతా భారత్ వైపు ఆశావహ దృక్పథంతో చూస్తోంది. నూతన సాంకేతికత ఆధారంగా పౌరులకు సేవలందుతున్నాయి. అభివృద్ధితో పాటు ప్రకృతిని కాపాడుతున్నాం.
ద్రౌపది ముర్ముమాది ప్రజల ఆత్మవిశ్వాసం పెంచే ప్రభుత్వం. సర్జికల్ స్ట్రైక్ ద్వారా సరిహద్దులు దాటిన ముష్కర మూకలను మట్టుబెట్టాం. ఆర్టికల్ 370 రద్దు, ట్రిబుల్ తలాక్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం.
డిజిటల్ ఇండియా దిశగా భారత్ ముందుకెళ్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకొని నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నాం. రాష్ట్రపతిపేదల ఆలోచన స్థాయిని కూడా పెంచుతున్నాం. ఆయుష్మాన్ భారత్ వంటి మెరుగైన పథకాలు తీసుకొచ్చాం. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నాం. అవినీతి రహిత వ్యవస్థలను రూపొందిస్తున్నాం. అవినీతికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగుతోంది. ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచాం.
రాష్ట్రపతి ప్రసంగం లైవ్ ఇక్కడ చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం