AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియుడి మోజులో కవల పిల్లలను హతమార్చిన తల్లి

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి కవల పిల్లలైన కన్నబిడ్డలను కడతేర్చింది. వివాహేతర సంబంధానికి అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు హతమార్చింది. అనంతరం ఇద్దరు కలిసి విషం తాగి అపస్మారకస్థితికి చేరుకున్నారు.

ప్రియుడి మోజులో కవల పిల్లలను హతమార్చిన తల్లి
Balaraju Goud
|

Updated on: Sep 15, 2020 | 6:25 PM

Share

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి కవల పిల్లలైన కన్నబిడ్డలను కడతేర్చింది. వివాహేతర సంబంధానికి అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు హతమార్చింది. అనంతరం ఇద్దరు కలిసి విషం తాగి అపస్మారకస్థితికి చేరుకున్నారు.

చిత్తూరు జిల్లాలోని సదుం మండలం చింతపర్తివారిపల్లిలో రామిరెడ్డిగారిపల్లికి చెందిన ఉదయ్ కు అదే గ్రామానికి చెందిన హేమశ్రీతో నాలుగేండ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నది. అయితే, హేమత్రీతో వేరొకరితో వివాహం జరిపించారు కుటుంబసభ్యులు. ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది హేమశ్రీ. అయినా ఆమెలో మార్పురాలేదు. దీంతో ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. వివాహేతర సంబంధం మానుకోవాలని హెచ్చరించారు.

అయితే హేమాశ్రీ ప్రియుడితో వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. దీంతో ప్రియుడు ఉదయ్‌కి ఫోన్ ఫ్లాన్ చేసుకుంది. ఊరు నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్లి బతుకుదామని ఒప్పించింది. అయితే, తన ఇద్దరు పిల్లలను వదిలించుకోవాలని భావించింది. ఇందుకు ప్రియుడు ఉదయ్ కుమార్ సాయం కోరింది. అతడితో కలిసి హేమశ్రీ కవలలను చింతపర్తిపల్లెలోగల నడిమోడు నీటి కుంటలో పడేసింది. అనంతరం భవిష్యత్తు గుర్తుకువచ్చి ఇద్దరు కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్నారులిద్దరు మృతి చెందారు. అయితే ఉదయ్ కుమార్ అపస్మారక స్థితికి చేరుకోగా హేమశ్రీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని 108ద్వారా చికిత్స నిమిత్తం పీలేరు ఆసుపత్రికి తరలించారు