దేశంలో మూడు వ్యాక్సిన్స్ ప్రయోగదశల్లో ఉన్నాయి: ఐసీఎంఆర్

కరోనా బారినుంచి త్వరలో దేశానికి విముక్తి లభిస్తుందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మూడు కరోనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశల్లో ఉన్నాయని భారత వైద్య పరిశోధన మండలి డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు.

దేశంలో మూడు వ్యాక్సిన్స్ ప్రయోగదశల్లో ఉన్నాయి: ఐసీఎంఆర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 15, 2020 | 7:20 PM

కరోనా బారినుంచి త్వరలో దేశానికి విముక్తి లభిస్తుందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మూడు కరోనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశల్లో ఉన్నాయని భారత వైద్య పరిశోధన మండలి డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. కాడిలా, భారత్ బయోటెక్ తొలి దశ ట్రయల్స్ పూర్తి చేశాయని చెప్పారు. సిరమ్ ఇన్సిస్ట్యూట్ రెండో దశ బీ3 ట్రయల్స్ పూర్తి చేసుకుందని, అనుమతుల తర్వాత మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 14 ప్రాంతాల్లో 1,500 మంది వాలంటీర్లపై ప్రయోగం చేపడుతుందని ఆయన వివరించారు.

భారత దేశంలో ఇప్పటివరకు 38.5 లక్షల మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారని, ఇది ప్రపంచంలోనే అత్యధికమన్నారు బలరాం. ఇప్పటివరకు 5.8 కోట్ల నమూనాలను పరీక్షించామని తెలిపారు. గత వారం 76 లక్షల పరీక్షలు జరిగాయని వివరించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1:5 వ వంతు మాత్రమేనని ఆయన తెలిపారు. ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయన్న ఆయన.. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల్లో 60 శాతం ఇక్కడే ఉన్నాయన్నారు.

పలు వైరస్ రోగాల నియంత్రణకు ప్లాస్మా థెరపీని వందేండ్లకు పైగా వినియోగిస్తున్నట్లు బలరామ్ భార్గవ తెలిపారు. ప్రస్తుతం కొవిడ్ రోగుల్లోనూ ప్లాస్మా థెరపీని వినియోగిస్తున్నారని, ఈ నేపథ్యంలో దీని పని తీరు గురించి అధ్యయనం జరుగుతున్నదని చెప్పారు. అంతర్జాతీయ అధ్యయనంలో భాగంగా మన దేశంలో 14 రాష్ట్రాల్లోని 25 జిల్లాలకు చెందిన 39 ఆసుపత్రుల్లో 468 మంది కరోనా రోగులకు ప్లాస్మా థెరపీని అమలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే మధ్యస్తం నుంచి తీవ్రమైన వ్యాధులను నియంత్రించడంలో, మరణాలను తగ్గించడంలో దీని ప్రభావం అంతగా కనిపించలేదని బలరామ్ భార్గవ వెల్లడించారు.

భారతదేశంలో మిలియన్ జనాభాకు కేసులు 3,573 మందికి కరోనా వైరస్ సోకితే, ప్రపంచ సగటు మిలియన్ జనాభాకు 3,704 కేసులు నమోదవుతున్నాయని బలరాం భార్గవ వివరించారు. మన దేశంలో మిలియన్ జనాభాకు మరణాల సంఖ్య 58 అయితే, ప్రపంచంలో అత్యల్పంగా ఉన్నాయన్నారు. ఇది ప్రపంచ సగటు 118గా ఉందన్నారు. కేవలం 27 రోజులలో దేశంలో ఒక కోటి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల నుండి 2 కోట్ల కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేసామని.. దేశంలో పాజిటివిటీ రేటు 8.14 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?