వైరల్ వీడియో: దేశ‌ రాజ‌ధాని వీధుల్లో కావ్ కావ్ అంటోన్న‌ తెల్ల ‌కాకి..

కాకి అన‌గానే న‌లుపు రంగు గుర్తుకు వ‌స్తుంది. అదే బండ గుర్తు కూడా. అయితే కొన్ని కాకులు తెలుపు రంగులోనూ ఉంటాయి. ఇలాంటి అరుదైన తెలుపు కాకి ఒక‌టి దేశ రాజ‌ధాని ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ కెమెరాకు చిక్కింది. న‌ల్ల కాకుల‌తో పాటే రోడ్ల‌పై విహ‌రిస్తూ ఉంది. దీన్నిచూసిన ‌కొంద‌రు మొద‌ట..

  • Tv9 Telugu
  • Publish Date - 9:03 am, Thu, 9 July 20
వైరల్ వీడియో: దేశ‌ రాజ‌ధాని వీధుల్లో కావ్ కావ్ అంటోన్న‌ తెల్ల ‌కాకి..

కాకి అన‌గానే న‌లుపు రంగు గుర్తుకు వ‌స్తుంది. అదే బండ గుర్తు కూడా. అయితే కొన్ని కాకులు తెలుపు రంగులోనూ ఉంటాయి. ఇలాంటి అరుదైన తెలుపు కాకి ఒక‌టి దేశ రాజ‌ధాని ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ కెమెరాకు చిక్కింది. న‌ల్ల కాకుల‌తో పాటే రోడ్ల‌పై విహ‌రిస్తూ ఉంది. దీన్నిచూసిన ‌కొంద‌రు మొద‌ట పావురం అనుకున్నారు. కానీ అది కావ్ కావ్ అంటూ కూత కూయ‌డం మొద‌లు పెట్టిన త‌ర్వాత అవాక్క‌య్యారు. దీంతో వారి ద‌గ్గ‌ర ఉన్న‌ ఫోన్ల‌తో చ‌క చ‌కా ఫొటోలు, వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలు, ఫొటోలు కాస్తా ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఇవి చాలా అరుదుగా క‌నిపిస్తూంటాయి. తెల్ల కాకిని ఆల్బినో అని కూడా పిలుస్తూంటారు. ఈ వీడియోపై స్పందించిన సైంటిస్టులు.. జన్యుప‌ర‌మైన కార‌ణా వ‌ల్ల లేదా హార్మోన్ల లోపం వ‌ల్ల ఇలా తెల్ల రంగులో పుడ‌తాయ‌ని పేర్కొన్నారు. కాగా లాక్ డౌన్ స‌మ‌యంలో ఇదివ‌ర‌కే ప‌లు న‌గ‌రాల్లో ర‌క‌ర‌కాల వన్య ప్రాణులు రోడ్ల‌పై విహ‌రించిన విష‌యం తెలిసిందే.

Read More:

భార‌త ఆర్మీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. 89 యాప్‌లు బ్యాన్..

క‌రోనాకు చెక్ పెట్టేందుకు త‌క్కువ ధ‌ర‌కే మ‌రో జ‌న‌రిక్ మెడిసిన్‌..