వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణోత్సవం

చల్లపల్లిలోని శ్రీమద్వివిరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 41వ వార్షిక కల్యాణ మహోత్సవాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్నాయి. మాఘ శుద్ధ దశమి రోజున గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామికి కల్యాణోత్సవం నిర్వహించటం వార్షికంగా జరుగుతోంది. కల్యాణోత్సవాలకు దేవాలయ౦ ముస్తాబవుతో౦ది. ఈ నెల‌ 14న ఉదయం స్వామికి ఆవుపాలతో విశేష అభిషేకాలు,  కలశ ప్రతిష్ఠ, అఖండ జ్యోతి, మధ్యాహ్నం 12గంటలకు స్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం సహస్ర నామార్చనలు, పుష్పార్చనలు, శనివారం శ్రీమద్విరాట్‌ విశ్వకర్మ […]

వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణోత్సవం

Edited By:

Updated on: Oct 18, 2020 | 10:35 PM

చల్లపల్లిలోని శ్రీమద్వివిరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 41వ వార్షిక కల్యాణ మహోత్సవాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్నాయి. మాఘ శుద్ధ దశమి రోజున గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామికి కల్యాణోత్సవం నిర్వహించటం వార్షికంగా జరుగుతోంది. కల్యాణోత్సవాలకు దేవాలయ౦ ముస్తాబవుతో౦ది.

ఈ నెల‌ 14న ఉదయం స్వామికి ఆవుపాలతో విశేష అభిషేకాలు,  కలశ ప్రతిష్ఠ, అఖండ జ్యోతి, మధ్యాహ్నం 12గంటలకు స్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం సహస్ర నామార్చనలు, పుష్పార్చనలు, శనివారం శ్రీమద్విరాట్‌ విశ్వకర్మ జయంతి, ఉత్సవ విగ్రహ మూర్తులతో స్వామి వారి ఊరేగింపు నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.