హడావిడిగా ఢిల్లీకి తమిళిసై… పిలిచింది అందుకేనా ?
తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. అది కూడా వెంటనే రమ్మని.. దాంతో తెలంగాణ పాలిటిక్స్… ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రాన్ని వణికిస్తున్న ఆర్టీసీ సమ్మె ఒక్కసారిగా వేడెక్కింది. నిన్న ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాలు, పొలిటికల్ లీడర్లు గవర్నర్ ను కలిసి రోజు రోజుకూ తీవ్రమవుతున్న ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు. ఆ మర్నాడే గవర్నర్ కు ఢిల్లీ నుంచి పిలుపురావడం.. అది కూడా వెంటనే రమ్మని చెప్పడం ఒకింత ఆసక్తిగాను.. […]
తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. అది కూడా వెంటనే రమ్మని.. దాంతో తెలంగాణ పాలిటిక్స్… ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రాన్ని వణికిస్తున్న ఆర్టీసీ సమ్మె ఒక్కసారిగా వేడెక్కింది. నిన్న ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాలు, పొలిటికల్ లీడర్లు గవర్నర్ ను కలిసి రోజు రోజుకూ తీవ్రమవుతున్న ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు. ఆ మర్నాడే గవర్నర్ కు ఢిల్లీ నుంచి పిలుపురావడం.. అది కూడా వెంటనే రమ్మని చెప్పడం ఒకింత ఆసక్తిగాను.. ఆశ్చర్యంగాను కనిపిస్తోంది.
ఢిల్లీ పిలుపందుకున్న తెలంగాణ గవర్నర్ హడావిడిగా ఢిల్లీకి బయలుదేరారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతోను, 4 గంటలకు హోం మంత్రి అమిత్ షాతోను తమిళిసై భేటీ కాబోతున్నారు. ఆర్టీసీ సమ్మె సెంట్రిక్ గానే ఈ పిలుపు వచ్చినట్లు చెబుతున్నా.. కొన్ని రోజులుగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై క్షుణ్ణంగా నివేదిక తీసుకునేందుకే తమిళిసైని ఢిల్లీకి పిలిపించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఆర్టీసీ సమ్మెకు దారి తీసిన పరిస్థితులు.. అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతున్నాయి. చర్చల్లేవని ముఖ్యమంత్రి ప్రకటించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కార్మిక సంఘాల గొంతెమ్మ కోర్కెలను ఆమోదించి.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మాంద్యం పాలు చేయలేనని ముఖ్యమంత్రి కెసీఆర్ స్టబర్న్ గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ స్టాండ్ ని మేధావులు సమర్థిస్తున్నారు. లోక్ సత్తా అధినేత జయ ప్రకాశ్ నారాయణ.. తెలంగాణ ముఖ్యమంత్రి స్టాండ్ అభినందనీయమని వ్యాఖ్యానించినట్లు కథనాలొచ్చాయి.
ఈ క్రమంలో గవర్నర్ ని ఢిల్లీకి పిలవడం ద్వారా గ్రౌండ్ పొజీషన్ ను తెలుసుకునేందుకు బిజెపి అధినాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని కమలనాథులు కలలు కంటున్న తరుణంలో తాజా ఆర్టీసీ సమ్మెను పొలిటికల్ గా వినియోగించుకునేందుకు మోదీ, అమిత్ షా ప్రయత్నిస్తున్నట్లు గవర్నర్ ను నివేదిక కోరడం ద్వారా తేలిపోయింది. ఈ క్రమంలో గవర్నర్ నివేదిక ఆధారంగా కేంద్రం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.