పరిణయోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం
తిరుమల శ్రీవారికి ప్రతీ ఏటా ఆర్భాటంగా జరిగే శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు నెలా పది రోజులుగా తిరుమలేశుని భక్తులకు శ్రీవారి దర్శనం లభించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతీఏటా మే 1వ తేదీ నుంచి జరగాల్సిన పరిణయ ఉత్సవాలు...
తిరుమల శ్రీవారికి ప్రతీ ఏటా ఆర్భాటంగా జరిగే శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు నెలా పది రోజులుగా తిరుమలేశుని భక్తులకు శ్రీవారి దర్శనం లభించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతీఏటా మే 1వ తేదీ నుంచి జరగాల్సిన పరిణయ ఉత్సవాలు కూడా వాయిదా పడ్డాయి. ఈ వార్త శ్రీవారి భక్తులకు షాకిచ్చేదే. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గురువారం నిర్ణయం తీసుకున్నారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం తిరుమలలో మే ఒకటో తేదీ నుంచి మూడవ తేదీ వరకు శ్రీ పద్మావతి శ్రీనివాసుల ఉత్సవాలను నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోని పరిస్థితిలో ఈ పరిణయ ఉత్సవాలను వాయిదా వేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది. ఈ ఉత్సవాలను ప్రతి ఏటా తిరుమల ఆనంద నిలయం సమీపంలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఆర్భాటంగా నిర్వహించేవారు. అయితే ఈసారి ఈ పరిణయోత్సవాలను అత్యంత సాదాసీదాగా శ్రీవారి ఆలయంలోనే నిర్వహించాలని టిటిడి తొలుత భావించింది.
అయితే ఈ ఉత్సవాల నిర్వహణకు ఎక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరం అవుతారని నిర్వహకులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విధులకు హాజరయ్యే సిబ్బంది సామాజిక దూరాన్ని పాటించడం కష్టతరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ పరిస్థితిని శ్రీశ్రీశ్రీ పెదజీయర్ స్వామివారితోనూ.. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారు చర్చించారు. టిటిడి అధికారులు పూర్తిస్థాయి సమాలోచనల తర్వాత ఈ శ్రీవారి ఉత్సవాన్ని లాక్‌డౌన్ పీరియడ్ ముగిసిన తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు. అయితే లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితిలో.. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలను నిర్వహించే తేదీలను తర్వాత ఖరారు చేయాలని టిటిడి అధికారులు ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నారు.
Read this: ప్రసాదాలలో విషం.. ఉగ్రకుట్రకు తీహార్‌లో స్కెచ్
Read this: కరోనా కేసుల సంఖ్యపై అనుమానాలు.. కేసీఆర్ స్పందించాలన్న ఉత్తమ్
Read this: అంత్యక్రియలు అడ్డుకుంటే అలా చేయండి.. డీజీపీకి జగన్ డైరెక్షన్
Read this: ఒకే గదిలో 40 మంది.. తెలుగోళ్ళ ‘మహా’ కష్టం
Read this: పార్లమెంటు నిర్మాణం వద్దంటే షాకే..!
Read this: పట్టాలెక్కనున్న రైళ్ళు..! రీజన్ ఇదే
Read this: ఆదాయమార్గాలపై సీఎం నజర్.. అందుకే ఆయన నియామకం
Read this: చెల్లని విరాళంతో ప్రచార ఆర్భాటం.. రేవంత్‌పై టీఆర్ఎస్ ధ్వజం
Read this: మత్స్యకారులకు మహర్దశ.. సీఎం ప్లాన్ లీక్ చేసిన మంత్రి
Read this: లాక్ డౌన్ తర్వాత మోడీ యాక్షన్ ప్లాన్
Read this: Breaking మరిన్ని ఆంక్షల సడలింపు