AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

బంగాళాఖాతం ఆగ్రేయ ప్రాంతం నుంచి వీస్తున్న తేమ గాలల మూలంగా.. గత రెండు, మూడు రోజులుగా.. తమిళనాడు, చెన్నైలో.. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్నాయి. ఇప్పుడు ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడిందని.. వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ తేమ గాలల ప్రభావం కారణంగా.. ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు సూచించారు. తుఫాను వ్యతిరేక సుడిగాలులు వీస్తున్నందున.. మేఘాలేర్పడి.. వర్షాలు పడనున్నాయని.. అంతేకాకుండా.. చలి […]

నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 02, 2019 | 5:07 PM

Share

బంగాళాఖాతం ఆగ్రేయ ప్రాంతం నుంచి వీస్తున్న తేమ గాలల మూలంగా.. గత రెండు, మూడు రోజులుగా.. తమిళనాడు, చెన్నైలో.. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్నాయి. ఇప్పుడు ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడిందని.. వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ తేమ గాలల ప్రభావం కారణంగా.. ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు సూచించారు. తుఫాను వ్యతిరేక సుడిగాలులు వీస్తున్నందున.. మేఘాలేర్పడి.. వర్షాలు పడనున్నాయని.. అంతేకాకుండా.. చలి తీవ్రత కూడా తగ్గే అవకాశముందన్నారు.

Follow Us