AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ ఎంపీల ప్రోగ్రస్ రిపోర్ట్.!

కరోనా సమయంలో జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలుగుదేశంపార్టీ తన వంతు పాత్ర పోషించిందని ఆపార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ చెప్పారు. 23 బిల్లులపై జరిగిన చర్చల్లో పాల్గొని అభిప్రాయాలు చెప్పామని వారు తెలిపారు. అతి పెద్ద సంక్షోభమైన కరోనా, దేశానికి చైనా సరిహద్దు వివాదంపై చర్చ జరగలేదని గల్లా జయదేవ్ అన్నారు. కోవిడ్ కారణంగా ఆరోగ్య, ఆర్ధిక సంక్షోభం తలెత్తిందని.. అది మానవ జీవన సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. […]

టీడీపీ ఎంపీల ప్రోగ్రస్ రిపోర్ట్.!
Venkata Narayana
|

Updated on: Sep 24, 2020 | 1:14 PM

Share

కరోనా సమయంలో జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలుగుదేశంపార్టీ తన వంతు పాత్ర పోషించిందని ఆపార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ చెప్పారు. 23 బిల్లులపై జరిగిన చర్చల్లో పాల్గొని అభిప్రాయాలు చెప్పామని వారు తెలిపారు. అతి పెద్ద సంక్షోభమైన కరోనా, దేశానికి చైనా సరిహద్దు వివాదంపై చర్చ జరగలేదని గల్లా జయదేవ్ అన్నారు. కోవిడ్ కారణంగా ఆరోగ్య, ఆర్ధిక సంక్షోభం తలెత్తిందని.. అది మానవ జీవన సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ధిక వ్యవహారాల్లో కేంద్రానికి కీలక సలహాలు ఇచ్చామని, ఉద్యోగాలు దెబ్బతినకుండా ఉండేందుకు సూచనలు చేసామని.. ఖర్చులను ప్రాధాన్యత క్రమంలో చేయాలని సూచించామని గల్లా వెల్లడించారు.

ప్రతిపక్షంలో ఉన్నా ఆంధ్ర రాష్ట్ర సమస్యలపై సభలో మాట్లాడామన్నారు. ఆంగ్ల మాధ్యమం నిర్బంధం చేయడం తగదని చెప్పామని.. ఏపీకి 3 రాజధానులతో రాజకీయ క్రీడకు తెరతీసి, రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని సభకు వివరించామని జయదేవ్ తెలిపారు. ఇక, కోవిడ్ మీద చర్చలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సందర్భరహిత వ్యాఖ్యలు చేస్తే అడ్డుకున్నామని మరో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ చెప్పారు. టీటీడీని దుర్వినియోగం చేసే ప్రయత్నాలను బహిర్గతం చేశామని రవీంద్ర చెప్పుకొచ్చారు.