టాటా సూపర్ యాప్ వచ్చేస్తోంది
భారతదేశ ప్రతిష్టాత్మక వ్యాపార వాణిజ్య సంస్థ టాటా కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతోంది. ఇ - కామర్స్ రంగంలోకి భారీ ఎత్తున ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం ఒక సూపర్ యాప్‌ను..
భారతదేశ ప్రతిష్టాత్మక వ్యాపార వాణిజ్య సంస్థ టాటా కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతోంది. ఇ – కామర్స్ రంగంలోకి భారీ ఎత్తున ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం ఒక సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది. ఫుడ్, కిరాణా, ఫ్యాషన్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్ ఇలా అన్ని రకాల వస్తువుల అమ్మకాల నుంచి.. నగదు డిజిటల్ లావాదేవీల వరకూ ఈ యాప్ ద్వారా వీలు కల్పిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సూపర్ యాప్ అందుబాటులోకి రానుందని మార్కెట్ వర్గాల అంచనా.
తన సూపర్ యాప్ ద్వారా అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్, రిలయన్స్ వంటి బడా సంస్థలకు పోటీ ఇచ్చేందుకు టాటా రెడీ అవుతోంది. చైనాలోని ఫేమస్ యాప్స్ అయిన టెన్సెంట్, అలీబాబా తరహాలో దీనిని రూపొందిస్తారని తెలుస్తోంది. దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో దీన్ని లాంచ్ చేయబోతున్నట్టు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. డిజిటల్ సేవల్లో తమకు అపారమైన అవకాశాలున్నాయని ఆయన అన్నారు. భారతదేశంలో కోట్లాదిమంది వినియోగదారులను అనుసంధానిస్తూ వారికి సులభతరమైన ఆన్‌లైన్ సేవల్నిఅందించనున్నామని ఆయన పేర్కొన్నారు.