మహిళలను అవమానించడమే కాంగ్రెస్-డీఎంకే సంస్కృతి.. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
డీఎంకే-కాంగ్రెస్ కూటమి అధికారం లోకి వస్తే తమిళనాడు మహిళలకు భద్రత ఉండదని ఘాటు వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోదీ.
తమిళనాడు ప్రచారం మరింత వేడెక్కింది. డీఎంకే కూటమిపై వాగ్భాణాలు సంధించారు ప్రధాని మోదీ. డీఎంకే-కాంగ్రెస్ కూటమి అధికారం లోకి వస్తే తమిళనాడు మహిళలకు భద్రత ఉండదని ఘాటు వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోదీ. రెండు రోజుల క్రితం తమిళనాడు సీఎం పళనిస్వామి తల్లిపై డీఎంకే ఎంపీ రాజా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. తిరువూరు జిల్లా దారాపురంలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
మహిళలను అగౌరవపర్చడమే డీఎంకే నేతల లక్ష్యమని మోదీ మండిపడ్డారు. ఎన్నికల్లో మహిళా ఓటర్లు డీఎంకే-కాంగ్రెస్ కూటమికి గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. స్కాములు చేయడమే డీఎంకే-కాంగ్రెస్ నేతలకు తెలుసన్నారు. అమ్మ జయలలితను కూడా అవమానపర్చిన చరిత్ర డీఎంకేకు ఉందని మోదీ ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా జయలలితను డీఎంకే నేతలు అవమానించిన ఘటనను ఎవరు మరిచిపోరన్నారు.
ప్రధాని మోదీ ప్రచార సభలో ఎన్డీఏ కూటమి భాగస్వాములు ఎఐఎడీఎంకే నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం, అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి పార్టీల అభ్యర్థుల కోసం మోదీ ప్రచారం చేయనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం.
చిన్న రైతుల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. చిన్న ప్రభుత్వం మధ్యవర్తుల ఒత్తిడి నుండి విముక్తి కలిగించే సంస్కరణలను మన ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. సాయిల్ హెల్త్ కార్డ్, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఇ-నామ్ పథకం వంటి చర్యలు రైతులను శక్తివంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
NDA’s priority is the welfare of the small farmer.
Our Government has initiated reforms that will free the small farmers from the pressures of middlemen.
Measures such as Soil Health Card, Kisan Credit Cards, e-NAM scheme are aimed at empowering farmers: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) March 30, 2021