జీ4 వైరస్ కొత్తదేమీ కాదు : డబ్ల్యూహెచ్ఓ

కొత్త స్వైన్‌ ఫ్లూ వైరస్‌గా చెబుతున్న ఈ జీ4 వైరస్‌ కొత్తదేమీ కాదని డబ్ల్యూహెచ్ఓ క్లారిటీ ఇచ్చింది. చైనాలో మరో స్వైన్‌ఫ్లూ వైరస్ కళ్లు తెరిచిందన్న వార్తలను డబ్ల్యూహెచ్ఓ వివరణ ఇచ్చింది.

జీ4 వైరస్ కొత్తదేమీ కాదు : డబ్ల్యూహెచ్ఓ
Follow us

|

Updated on: Jul 02, 2020 | 6:03 PM

కొత్త స్వైన్‌ ఫ్లూ వైరస్‌గా చెబుతున్న ఈ జీ4 వైరస్‌ కొత్తదేమీ కాదని డబ్ల్యూహెచ్ఓ క్లారిటీ ఇచ్చింది. చైనాలో మరో స్వైన్‌ఫ్లూ వైరస్ కళ్లు తెరిచిందన్న వార్తలను డబ్ల్యూహెచ్ఓ వివరణ ఇచ్చింది. కరోనా వైరస్ తో ప్రపంచమంతా పోరాడుతోంది. కోవిడ్19 వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూస్తున్నారు. ఇదే క్రమంలో చైనాలో కొత్త వైరస్ G4-EA H1N1 వెలుగుచూసిందని వార్తలు మరింత టెన్షన్ పుట్టించాయి. దీంతో మరోసారి ప్రపంచం ఉలికిపడింది. మరో సంక్షోభం వస్తుందేమోనని ప్రజలు కంగారు పడుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది.

కొత్త స్వైన్‌ ఫ్లూ వైరస్‌గా చెబుతున్న ఈ జీ4 వైరస్‌ను 2011 నుంచీ తమ సంస్థ గమనిస్తోందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. 2011 నుంచి 2018 మధ్య కాలంలోనే ఈ వైరస్‌ వెలుగు చూసిందన్నారు. పందుల పెంపకందారుల్లో ఎంత మంది దీని బారినపడ్డారనే విషయానికి సంబంధించి జరిగిన అధ్యయనంపై చర్చించినట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ మైక్ రయన్ తెలిపారు. ఇటీవల ఈ కొత్త వైరస్‌ ప్రపంచాన్ని చుట్టేయవచ్చని అమెరికాకు చెందిన ‘ప్రొసిడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్‌లో ప్రచురించారు. చైనాలో కొత్త వైరస్ కళ్లుతెరిచిందనే విశ్లేషణలు ఈ అధ్యయనం ఆధారంగా వెలువడటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మేరకు స్పష్టతనిచ్చింది.