వంశీ గారూ ఈ సైలెన్స్ వెనుక రీజన్ ఏంటి..?
వల్లభనేని వంశీమోహన్..ఏపీలో మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు. పరిటాల రవి అనుచరుడిగా, జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వంశీ..అనతికాలంలోనే మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. తొలిసారి ఎంపీగా పోటీచేసి పరాజయం పాలయినప్పటికి..ఆ తర్వాత రెండు టర్మ్స్‌లోనూ గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాగా ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిణామాల దృష్యా వంశీ పొలిటికల్ కెరీర్‌పై క్లారిటీరావడం లేదు. ఇటీవలే ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అంతకుముందు అతడు బీజేపీ […]
వల్లభనేని వంశీమోహన్..ఏపీలో మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు. పరిటాల రవి అనుచరుడిగా, జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వంశీ..అనతికాలంలోనే మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. తొలిసారి ఎంపీగా పోటీచేసి పరాజయం పాలయినప్పటికి..ఆ తర్వాత రెండు టర్మ్స్‌లోనూ గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాగా ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిణామాల దృష్యా వంశీ పొలిటికల్ కెరీర్‌పై క్లారిటీరావడం లేదు. ఇటీవలే ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అంతకుముందు అతడు బీజేపీ ఎంపీ సుజనాచౌదరి, సీఎం జగన్‌లతోనూ చర్చలు జరిపారు. అన్ని లెక్కలు వేసుకున్న పిమ్మట ఫైనల్‌గా వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు వెలువడ్డాయి.
కానీ రాజీనామా ఎనౌన్స్ చేసి 15 రోజులు కావొస్తున్నా.. వంశీ నెక్ట్స్ పొలిటికల్ మూవ్‌పై మాత్రం క్లారిటీ రావడం లేదు. వైసీపీలోకి వెళ్తే..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని సీఎం జగన్ తేల్చి చెప్పేయడంతో..వంశీ తటపటాయిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు..గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్..వంశీ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు అతని అనుచరులు ఆందోళనలు కూడా దిగారు. ఇక రాజీనామా లేఖలో తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉండబోతున్ననంటూ కూడా ప్రకటన చేశారు ఎమ్మెల్యే వంశీ. అయితే వంశీ అనుచరులు మాత్రం ఏ పార్టీలోకి వెళ్లినా అతనితోనే ఉంటామని..కానీ రాజకీయాలకు మాత్రం దూరంకావొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.
అందుకే వంశీ అడుగులు ఇప్పుడు ఎవ్వరికి అంతుపట్టకుండా ఉన్నాయి. వాస్తవానికి వంశీ పార్టీ మారతారని ఎప్పటినుంచో వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్టే ఆయన రాజీనామా చేసినా..మరో పార్టీలో జాయిన్ అవ్వకుండా స్తబ్ధుగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. కేసులు నేపథ్యంలో..మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు వంశీ ఇలాంటి సైలెన్స్ మెయింటేన్ చేస్తారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వంశీకి ప్రాధాన్యం ఇవ్వకుండా..చిన్నచూపు చూశారని..అందుకు జిల్లా టీడీపీకి పెద్దతలగా వ్యవహరిస్తోన్న ఓ నేత కారణమంటూ వంశీ అనుచరులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో కొనసాగేందుకు సాహసించరని అర్థమైపోతుంది. మరి ఎటువైపు ఎడ్జ్ తీసుకుంటారే తెలియాలంటే అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.