శిల్పా.. నీకు రూ. 10 కోట్లు ఓ లెక్కా..?: శివరాజ్ సింగ్ చౌహాన్

10 కోట్ల రూపాయల ఆఫర్ ను తిరస్కరించిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని అభినందించారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఓ ప్రముఖ ఆయుర్వేద కంపెనీ..స్లిమ్మింగ్ పిల్ మార్కెటింగ్ కోసం ఆమెను సంప్రదించగా..ఆ ప్రోడక్ట్ పై తనకు నమ్మకం లేదని 10కోట్ల రూపాయలను తిరస్కరించారు శిల్పాశెట్టి. దీనిపై స్పందించిన శివరాజ్ సింగ్ చౌహాన్..ఆమెను ప్రశంసించారు. మిగతా సెలబ్రిటీలు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకోవాలని కోరారు. కంపెనీల అమ్మకాలు పెంచడం కోసం అవాస్తవాలను ప్రచారం చేయొద్దని..సమాజం పట్ల […]

శిల్పా.. నీకు రూ. 10 కోట్లు ఓ లెక్కా..?: శివరాజ్ సింగ్ చౌహాన్
Follow us
Pardhasaradhi Peri

| Edited By:

Updated on: Aug 20, 2019 | 5:47 PM

10 కోట్ల రూపాయల ఆఫర్ ను తిరస్కరించిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని అభినందించారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఓ ప్రముఖ ఆయుర్వేద కంపెనీ..స్లిమ్మింగ్ పిల్ మార్కెటింగ్ కోసం ఆమెను సంప్రదించగా..ఆ ప్రోడక్ట్ పై తనకు నమ్మకం లేదని 10కోట్ల రూపాయలను తిరస్కరించారు శిల్పాశెట్టి. దీనిపై స్పందించిన శివరాజ్ సింగ్ చౌహాన్..ఆమెను ప్రశంసించారు. మిగతా సెలబ్రిటీలు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకోవాలని కోరారు. కంపెనీల అమ్మకాలు పెంచడం కోసం అవాస్తవాలను ప్రచారం చేయొద్దని..సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు.