ఆర్టీసీ ఉద్యోగులకు మావోలతో లింకులు..సీపీ సంచలన వ్యాఖ్యలు

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన చలో ట్యాంక్‌బండ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, కార్మికుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆందోళనకారులను చెల్లాచెదురు చేసే క్రమంలో భయానక వాతావరణం నెలకుంది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి…లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా..ఒక మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. అయితే ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్లు వెనుక నిషేదిత మావోయిస్టు అనుబంధ సంఘాలు […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:12 am, Sun, 10 November 19
ఆర్టీసీ ఉద్యోగులకు మావోలతో లింకులు..సీపీ సంచలన వ్యాఖ్యలు

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన చలో ట్యాంక్‌బండ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, కార్మికుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆందోళనకారులను చెల్లాచెదురు చేసే క్రమంలో భయానక వాతావరణం నెలకుంది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి…లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా..ఒక మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. అయితే ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్లు వెనుక నిషేదిత మావోయిస్టు అనుబంధ సంఘాలు ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారే విద్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల రాళ్లదాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారన్న సీపీ…అందుకు బాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  సీపీ వ్యాఖ్యలను ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వథ్థామరెడ్డి, థామస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాగా ‘చలో ట్యాంక్‌బండ్ ‘ ఘటనలో మహిళల పట్ల పోలీసుల వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.