AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రణ్‌వీర్ సింగ్ కొత్త లుక్ చూశారా….

బాలీవుడ్ అందాల జంట రణ్‌వీర్‌సింగ్‌, దీపికా పదుకొణె. పెళ్లయిన తర్వాత కూడా వీరిద్దరు సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఇద్దరు కలిసి సమయం గడపేందుకు అవకాశం చిక్కింది. దీంతో దీప్‌వీర్‌ జంట ఇంట్లోనే ఉంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆట, పాట, వంటలు, చిలిపి పనులు చేస్తూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. వాటిని తమ ఫ్యాన్స్ కోసం సోషల్‌మీడియాలో పోస్ట్ులు పెడుతున్నారు. అయితే తాజాగా రణ్‌వీర్‌ సింగ్‌ ఓ ఫొటోను తన […]

రణ్‌వీర్ సింగ్ కొత్త లుక్ చూశారా....
Sanjay Kasula
|

Updated on: Jul 22, 2020 | 5:43 AM

Share

బాలీవుడ్ అందాల జంట రణ్‌వీర్‌సింగ్‌, దీపికా పదుకొణె. పెళ్లయిన తర్వాత కూడా వీరిద్దరు సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఇద్దరు కలిసి సమయం గడపేందుకు అవకాశం చిక్కింది. దీంతో దీప్‌వీర్‌ జంట ఇంట్లోనే ఉంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆట, పాట, వంటలు, చిలిపి పనులు చేస్తూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. వాటిని తమ ఫ్యాన్స్ కోసం సోషల్‌మీడియాలో పోస్ట్ులు పెడుతున్నారు.

అయితే తాజాగా రణ్‌వీర్‌ సింగ్‌ ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. అందులో రణ్‌వీర్‌ హెయిర్‌ స్టైల్‌ కొత్తగా ఉంది. పొడవాటి జుట్టును ఒక్కచోటుకు చేర్చి పిలకలా పెట్టారు. అలా చేసింది ఎవరో కాదు.. రణ్‌వీర్‌ సతీమణి దీపికా పదుకొణెనట. భర్త కోసం హెయిర్‌స్టైలిస్ట్‌గా మారి అలా పిలక జుట్టు వేసిందట.

రణ్‌వీర్‌ ఫొటోను పోస్టు చేస్తూ.. ‘‘దీపికా పదుకొణెనే ఈ హెయిర్‌స్టైల్‌ చేసింది. ఇది జపనీస్‌ చిత్రం ‘యోజంబో’లో నటుడు తొషిరో మిఫునె హెయిర్‌స్టైల్‌ను పోలి ఉంది. నాకు బాగా నచ్చింది. మీరేమంటారు?’’అని అంటున్నాడు. మాకు కూడా బాగా నచ్చిందంటూ దీప్‌వీర్‌ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రణ్‌వీర్‌ నటించిన ‘83’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నా.. లాక్‌డౌన్‌తో వాయిదా పడింది,

View this post on Instagram

Hair by: @deepikapadukone Very Mifune in ‘Yojimbo’. I like it. What do you think?

A post shared by Ranveer Singh (@ranveersingh) on