AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరాచీ విమాన ప్రమాదానికి కారణం ఇదే…

పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదం వెనుక ఇద్దరు పైలట్ల ముచ్చట్టే కారణమని తేలింది. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు వివరాలను పాకిస్తాన్‌ విమానయాన మంత్రి గులాం సర్వార్ ఖాన్ పార్లమెంట్‌కు వివరించారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ తప్పిదం కూడా ఇందులో కొంత ఉందని అన్నారు. కాక్‌పిట్ డేటా, వాయిస్‌ రికార్డర్‌ ద్వారా ఈ విషయాలు తెలిసిందన్నారు. పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఏఐ) కి చెందిన ఏ 320 విమానం మే 22న కరాచీ […]

కరాచీ విమాన ప్రమాదానికి కారణం ఇదే...
Sanjay Kasula
| Edited By: |

Updated on: Jun 24, 2020 | 8:06 PM

Share

పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదం వెనుక ఇద్దరు పైలట్ల ముచ్చట్టే కారణమని తేలింది. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు వివరాలను పాకిస్తాన్‌ విమానయాన మంత్రి గులాం సర్వార్ ఖాన్ పార్లమెంట్‌కు వివరించారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ తప్పిదం కూడా ఇందులో కొంత ఉందని అన్నారు. కాక్‌పిట్ డేటా, వాయిస్‌ రికార్డర్‌ ద్వారా ఈ విషయాలు తెలిసిందన్నారు.

పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఏఐ) కి చెందిన ఏ 320 విమానం మే 22న కరాచీ ఎయిర్‌పోర్టు సమీపంలోని నివాసిత ప్రాంతంలో కూలిన సంగతి తెలిసిందే. 97 మందిని బలిగొన్న ఈ ప్రమాదానికి పైలట్ల తప్పిదమే ప్రధాన కారణమని మంత్రి ప్రకటించారు.

పైలట్‌, కో పైలట్‌ ప్రామాణిక నియమాలను పాటించలేదని అన్నారు. వారిద్దరు కరోనా మహమ్మారి గురించి ముచ్చట్లలో మునిగిపోయారని.. ఆ సమయంలో విమానాన్ని ‘ఆటో పైలట్‌ మోడ్’‌లో ఉంచి ల్యాండింగ్‌కు ప్రయత్నించారని అన్నారు. రన్‌వే సమీపిస్తున్నప్పుడు విమానం చాలా ఎత్తులో ఉండగానే ల్యాండింగ్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారని… మరోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న క్రమంలో విమానం ఇంజన్లు దెబ్బతినడంతో  ఈ ప్రమాదం జరిగిందని పార్లమెంట్ కు వివరించారు.

ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..
ఆ 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..
ఆ 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..