కర్ణాటకలో ‘మాల్గుడి’ రైల్వేస్టేషన్

ఇప్పటి వరకు, మాల్గుడి మరియు మాల్గుడి స్టేషన్ దక్షిణ భారతదేశంలో కల్పిత ప్రదేశాలుగా ఉండేవి, అవి ఆర్.కె. నారాయణ్ యొక్క ఉత్తమ రచనల్లో ఉండే పట్టణం మరియు స్టేషన్ల పేర్లు. ఇప్పుడివి నిజం కాబోతున్నాయి. ఇటీవలే, భారతీయ రైల్వేలు కర్ణాటకలోని ‘అరుసులు’ రైల్వే స్టేషన్ పేరు మాల్గుడి రైల్వే స్టేషన్‍గా మార్చాలని నిర్ణయించుకున్నాయి. ఈ స్టేషన్ శివమొగ్గ-తలగుప్ప రైల్వే లైన్ లో హోసనగర్ తాలూకాలో ఉంది. ఒకప్పుడు ‘మాల్గుడి డేస్’ పేరుతో ప్రసారమైన ధారావాహికల్లో ఈ రైల్వే […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:32 pm, Tue, 5 March 19
కర్ణాటకలో 'మాల్గుడి' రైల్వేస్టేషన్

ఇప్పటి వరకు, మాల్గుడి మరియు మాల్గుడి స్టేషన్ దక్షిణ భారతదేశంలో కల్పిత ప్రదేశాలుగా ఉండేవి, అవి ఆర్.కె. నారాయణ్ యొక్క ఉత్తమ రచనల్లో ఉండే పట్టణం మరియు స్టేషన్ల పేర్లు. ఇప్పుడివి నిజం కాబోతున్నాయి.

ఇటీవలే, భారతీయ రైల్వేలు కర్ణాటకలోని ‘అరుసులు’ రైల్వే స్టేషన్ పేరు మాల్గుడి రైల్వే స్టేషన్‍గా మార్చాలని నిర్ణయించుకున్నాయి. ఈ స్టేషన్ శివమొగ్గ-తలగుప్ప రైల్వే లైన్ లో హోసనగర్ తాలూకాలో ఉంది. ఒకప్పుడు ‘మాల్గుడి డేస్’ పేరుతో ప్రసారమైన ధారావాహికల్లో ఈ రైల్వే స్టేషన్‌ను మాల్గుడి పేరుతో చూపించేవారు. ‘మాల్గుడి డేస్’కు దర్శకత్వం వహించిన నటుడు, దర్శకుడు శంకర్ నాగ్‌ జ్ఞాపకార్థంగా ఈ రైల్వే స్టేషన్‌కు ‘మాల్గుడి’ పేరు పెడుతున్నారు. మాల్గుడి డేస్ TV సీరీస్ నుండి చాలా ఐకానిక్ షాట్లు ఈ స్టేషన్లో చిత్రీకరించబడ్డాయి.

స్టేషన్ పేరు మార్చడంతో పాటు, స్టేషన్ను 1.3 కోట్ల బడ్జెట్‍తో పునర్నిర్మించటానికి భారతీయ రైల్వేలు హామీ ఇచ్చాయి. స్టేషన్ సమీపంలో మాల్గుడి మ్యూజియం ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు కూడా ఉన్నాయి. మైసూర్ జంక్షన్ మరియు యశ్వంతాపూర్ జంక్షన్ల మధ్య నడుస్తున్న యశ్వంతాపూర్ ‍మైసూర్ ట్రైన్ 2011 లో భారతీయ రైల్వేల ద్వారా మాల్గుడి ట్రైన్‍గా మార్చబడింది.