పవన్‌కు చెప్పులు గిప్ట్‌గా ఇచ్చిన ఫ్యాన్

తెలుగు రాష్ట్రాల్లో పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఎక్కడికి వచ్చినా ఆయన్ను చూసేందుకు ఫ్యాన్స్‌ ఎగబడిపోతుంటారు. వారి వీరాభిమానంతో పలుమార్లు ఆయన కిందపడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా జనసేనాని అమరావతి పర్యటనకొచ్చిన సందర్భంగా ఓ సంఘటన జరిగింది. రాజధాని మారుతుందన్న వార్తల నేపథ్యంలో ఆందోళనకు గురైన రైతులకు మద్దతుగా నిలిచారు జనసేనాని. ఇందులో భాగంగా అమరావతిలో పర్యటించేందుకు మంగళగిరి పాత బస్టాండ్‌కు చేరుకున్నారు. ఆయనకు జనసైనికులు, అభిమానులు ఘన […]

పవన్‌కు చెప్పులు గిప్ట్‌గా ఇచ్చిన ఫ్యాన్
Follow us
Pardhasaradhi Peri

| Edited By: Srinu

Updated on: Aug 30, 2019 | 6:55 PM

తెలుగు రాష్ట్రాల్లో పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఎక్కడికి వచ్చినా ఆయన్ను చూసేందుకు ఫ్యాన్స్‌ ఎగబడిపోతుంటారు. వారి వీరాభిమానంతో పలుమార్లు ఆయన కిందపడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా జనసేనాని అమరావతి పర్యటనకొచ్చిన సందర్భంగా ఓ సంఘటన జరిగింది.

రాజధాని మారుతుందన్న వార్తల నేపథ్యంలో ఆందోళనకు గురైన రైతులకు మద్దతుగా నిలిచారు జనసేనాని. ఇందులో భాగంగా అమరావతిలో పర్యటించేందుకు మంగళగిరి పాత బస్టాండ్‌కు చేరుకున్నారు. ఆయనకు జనసైనికులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఓ అభిమాని తాను తయారుచేసిన చెప్పులను పవన్‌కు గిఫ్ట్ గా ఇచ్చాడు. తాను ఇచ్చిన చెప్పులతోనే అమరావతిలో పర్యటించాలని కోరాడు. నవ్వుతూ ఆ చెప్పులు తీసుకున్న పవన్‌..అక్కడి నుంచి అమరావతికి వెళ్లారు.