‘మిరాజ్‌’ను చూసి జడుసుకున్న పాక్‌ ఎఫ్‌16

డిల్లీ: యస్..ఎక్స్‌ప్ట్ చేసినట్టుగానే ఉగ్రవాదుల పుట్ట పాకిస్థాన్‌కు భారత్‌ ఈసారి కాస్త గట్టిగానే బుద్ధిచెప్పింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై బాంబులతో విరుచుకుపడింది. భారత్‌కు చెందిన మిరాజ్‌ 2000 యుద్ధ విమానాలు మంగళవారం తెల్లవారుజామున నియంత్రణ రేఖను దాటి ఉగ్ర క్యాంపులపై దాడి చేశాయి. అయితే ఈ దాడిని ప్రతిఘటించేందుకు పాక్‌ యత్నించినప్పటికీ మన వాయుసేన బలగాన్ని చూసి తోకముడిచినట్లు తెలుస్తోంది. పాకిస్థానీ ఎఫ్‌ 16 విమానాలు ప్రతిదాడికి దిగినప్పటికీ.. మిరాజ్‌ […]

‘మిరాజ్‌’ను చూసి జడుసుకున్న పాక్‌ ఎఫ్‌16
Follow us

| Edited By: Vijay K

Updated on: Feb 26, 2019 | 12:54 PM

డిల్లీ: యస్..ఎక్స్‌ప్ట్ చేసినట్టుగానే ఉగ్రవాదుల పుట్ట పాకిస్థాన్‌కు భారత్‌ ఈసారి కాస్త గట్టిగానే బుద్ధిచెప్పింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై బాంబులతో విరుచుకుపడింది. భారత్‌కు చెందిన మిరాజ్‌ 2000 యుద్ధ విమానాలు మంగళవారం తెల్లవారుజామున నియంత్రణ రేఖను దాటి ఉగ్ర క్యాంపులపై దాడి చేశాయి. అయితే ఈ దాడిని ప్రతిఘటించేందుకు పాక్‌ యత్నించినప్పటికీ మన వాయుసేన బలగాన్ని చూసి తోకముడిచినట్లు తెలుస్తోంది.

పాకిస్థానీ ఎఫ్‌ 16 విమానాలు ప్రతిదాడికి దిగినప్పటికీ.. మిరాజ్‌ 2000 విమానాలను ఎదుర్కోలేక వెనక్కి వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాగా.. తాజా ఆపరేషన్‌ వాయు సేన పశ్చిమ కమాండ్‌ ఆధ్వర్యంలో జరిగినట్లు తెలుస్తోంది.

తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో భారత వాయుసేన ఈ దాడులను జరిపింది. దాదాపు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలను ఉగ్ర శిబిరాలపై జారవిడిచింది. ఈ దాడుల్లో 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమై ఉంటారని భావిస్తున్నారు. కాగా.. ఈ దాడిని అంబాలా ఎయిర్‌బేస్‌ నుంచి చేపట్టినట్లు కొన్ని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

తాజా దాడులపై భారత ప్రకటన విడుదల చేసింది. పుల్వామాలో మన జవాన్లపై దాడులకు ప్రతీకారం తీర్చుకున్నాం. పిఓకే లో వందలాది ఉగ్రవాద శిక్షణా శిబిరాలున్నాయి. ఖచ్చితమైన సమాచారంతో డ్రోన్ కెమెరాల సహాయంతో దాడులు చేసినట్టు విదేశాంగ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు.

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..