ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది పాకిస్తాన్ నే

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం రోజు రోజుకు భారతదేశాన్ని అతలాకుతం చేస్తోందని సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ ఆరోపించారు. జైషేమహమ్మద్, లష్కర్ ఏ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ స్థావరం ఇచ్చి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. భారతదేశాన్ని ముక్కలు చేయాలని చూస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర జవాన్లకు మద్దతుగా హైదరాబాద్ అంబర్ పేట హైమావతి హైస్కూల్ ఆధ్వర్యంలో అసువులు బాసిన జవాన్లకు నివాళి అర్పించారు ఎంపీ దత్తాత్రేయ. ఈ సందర్భంగా విద్యార్థులు 75 మీటర్ల జాతీయ […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:55 am, Fri, 22 February 19
ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది పాకిస్తాన్ నే

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం రోజు రోజుకు భారతదేశాన్ని అతలాకుతం చేస్తోందని సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ ఆరోపించారు. జైషేమహమ్మద్, లష్కర్ ఏ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ స్థావరం ఇచ్చి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. భారతదేశాన్ని ముక్కలు చేయాలని చూస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర జవాన్లకు మద్దతుగా హైదరాబాద్ అంబర్ పేట హైమావతి హైస్కూల్ ఆధ్వర్యంలో అసువులు బాసిన జవాన్లకు నివాళి అర్పించారు ఎంపీ దత్తాత్రేయ. ఈ సందర్భంగా విద్యార్థులు 75 మీటర్ల జాతీయ జెండాతో అంబర్ పేట పలు కాలనీల్లో ర్యాలీ తీశారు. జాతీయ భావాన్ని పెంపొందించేలా స్లోగన్స్ చేశారు.