లక్ష్మణ్ వారసుడు అతనే..ఎందుకంటే?
తెలంగాణా బిజెపిలో పెను మార్పులు జరగబోతున్నాయా? ఢిల్లీ పెద్దల అంతరంగం ఏంటి? మిషన్ 2023 కార్యాచరణపై అమిత్‌షా నజర్ పెట్టారా? హైదరాబాద్ హెడ్డాఫీసులో కమలం శ్రేణుల్లో ఇదే చర్చ హాట్ హాట్‌గా జరుగుతోంది. డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిని మారుస్తారని నాలుగు రోజుల క్రితమే ఢిల్లీ వర్గాలు మీడియాకు ఉప్పందించాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ మరిన్ని సమూల మార్పులకు సాక్ష్యం కాబోతున్నట్లు తాజాగా చెప్పుకుంటున్నారు బిజెపి వర్గాలు. బీజేపీలో డిసెంబర్ నెలలో కీలక మార్పులు జరుగుతాయని […]
తెలంగాణా బిజెపిలో పెను మార్పులు జరగబోతున్నాయా? ఢిల్లీ పెద్దల అంతరంగం ఏంటి? మిషన్ 2023 కార్యాచరణపై అమిత్‌షా నజర్ పెట్టారా? హైదరాబాద్ హెడ్డాఫీసులో కమలం శ్రేణుల్లో ఇదే చర్చ హాట్ హాట్‌గా జరుగుతోంది. డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిని మారుస్తారని నాలుగు రోజుల క్రితమే ఢిల్లీ వర్గాలు మీడియాకు ఉప్పందించాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ మరిన్ని సమూల మార్పులకు సాక్ష్యం కాబోతున్నట్లు తాజాగా చెప్పుకుంటున్నారు బిజెపి వర్గాలు.
బీజేపీలో డిసెంబర్ నెలలో కీలక మార్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష మార్పు నుంచి కోర్ కమిటీ దాకా…అక్కడి నుంచి ఢిల్లీ లెవల్ దాకా కొత్త నేతలకు చాన్స్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఓ యువ నేత దూసుకొచ్చారు. మరీ ఆయనకు చాన్స్ ఇస్తారా? లేక మరోసారి సీనియారిటీకే హైకమాండ్ జై కొడుతుందా? ఈచర్చ జోరుగా సాగుతోంది బిజెపిలో.
బీజేపీ జాతీయ సంస్థాగత ఎన్నికలు డిసెంబర్ తొలివారంలో ముగుస్తాయి. దీంతో జాతీయ అధ్యక్షుడి ఎంపికతో పాటు పలు రాష్ట్రాలకు కొత్త కెప్టెన్లు ప్రకటిస్తారని తెలుస్తోంది. తెలంగాణ అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే జోరుగా పైరవీలు నడుస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌కు సెకండ్ టర్మ్ రెన్యువల్ ఉంటుందా? లేదా? అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతుంది. మరోవైపు లక్ష్మణ్ కొనసాగింపు వుండదని ఇదివరకే అధిష్టానం ఆయనకు ఇండికేషన్ ఇచ్చేసిందని ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవడం లక్ష్మణ్‌కు కొంత బలం ఇస్తే….హుజూర్‌నగర్‌లో కనీసం 5 వేల ఓట్లు కూడా రాకపోవడం మైనస్‌గా మారింది. దీంతో ఆయన ప్యూచర్ ఏంటి? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
తాజాగా సమాచారం ప్రకారం బీజేపీ అధ్యక్ష రేసులో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ముందు రేసులో ఉన్నారు. ఈయన పేరును అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తుందట. టీఆర్‌ఎస్ సర్కార్‌కు ధీటైన జవాబు ఇచ్చే నేత కోసం అన్వేషణ ఇస్తుందట. ఇందులో భాగంగా యూత్‌లో ఫాలోయింగ్ ఉన్న సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారని రాష్ట్ర పార్టీలో చర్చ సాగుతోంది. సంజయ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈయనకే అధ్యక్ష పదవి వస్తుందనే ప్రచారం బీజేపీలో జోరుగా సాగుతోంది.
బండి సంజయ్ కరీంనగర్ నుంచి అసెంబ్లీకి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. దీంతో ఆయనపై రాష్ట్రం మొత్తం ఫోకస్ పడింది. ఆయనకు హిందూ ఫైర్‌బ్రాండ్‌గా పేరుంది. 2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యూత్‌లో ఫాలోయింగ్ ఉన్న నేతను అధ్యక్షుడిగా చేయాలనేది అధిష్టానం నిర్ణయంగా తెలుస్తోంది.
ఇప్పటివరకూ అధ్యక్షులుగా ఉన్న నేతలు హైదరాబాద్‌కు చెందినవారే. దీంతో పార్టీ రాజధాని దాటి బలోపేతం కావడం లేదు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో మూడు ఎంపీ సీట్లను గెలుచుకుంది. దీంతో ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు ఇస్తే… పార్టీ పెరిగే అవకాశం ఉందనేది అధిష్టానం ఆలోచన. సంజయ్ మాస్ లీడర్ కావడంతో జనాల్లోకి పార్టీని ఈజీగా తీసుకెళతారు. దీంతో హైదరాబాద్ బయట వచ్చే ఎన్నికల్లో పాగా వేయొచ్చు అనేది బీజేపీ పెద్దల ప్లాన్. బీజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కొత్త అధ్యక్షుడిని ఎంపిక జరుగుతుందని..చివరి నిమిషంలో మార్పులు జరగకుంటే…సంజయ్ బీజేపీ అధ్యక్షుడు కావడం ఖాయమని తెలుస్తోంది.