AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనుమానాలుంటే నాకు ఫోన్ చేయ్: పృథ్వీకి నాగబాబు వార్నింగ్

ఇటీవల వైసీపీలో చేరిన ప్రముఖ కమెడియన్ పృథ్వీ తన వ్యాఖ్యలతో చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా అధికార టీడీపీపై విరుచుకుపడుతున్న ఈ నటుడు.. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబుపై కూడా కామెంట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు పృథ్వీకి వార్నింగ్ ఇచ్చారు. వరుణ్‌తేజ్‌తో కలిసి నాగబాబు ఇటీవల రూ.1.25కోట్లను జనసేనకు విరాళంగా ఇచ్చారు. దీనిపై మాట్లాడిన పృథ్వీ.. పన్ను ఎగ్గొట్టేందుకే ఈ సొమ్మను విరాళంగా ఇచ్చారు. ఎక్కడి నుంచో తెచ్చిన సొమ్మును నాగబాబు తన […]

అనుమానాలుంటే నాకు ఫోన్ చేయ్: పృథ్వీకి నాగబాబు వార్నింగ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 19, 2019 | 8:47 AM

Share

ఇటీవల వైసీపీలో చేరిన ప్రముఖ కమెడియన్ పృథ్వీ తన వ్యాఖ్యలతో చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా అధికార టీడీపీపై విరుచుకుపడుతున్న ఈ నటుడు.. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబుపై కూడా కామెంట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు పృథ్వీకి వార్నింగ్ ఇచ్చారు.

వరుణ్‌తేజ్‌తో కలిసి నాగబాబు ఇటీవల రూ.1.25కోట్లను జనసేనకు విరాళంగా ఇచ్చారు. దీనిపై మాట్లాడిన పృథ్వీ.. పన్ను ఎగ్గొట్టేందుకే ఈ సొమ్మను విరాళంగా ఇచ్చారు. ఎక్కడి నుంచో తెచ్చిన సొమ్మును నాగబాబు తన కొడుకు ఖాతాలో వేసి దానిని జనసేకు విరాళంగా ఇచ్చారని వ్యాఖ్యలు చేశారు.

దీనిపై స్పందించిన నాగబాబు.. ‘‘అతడు అలా అన్నాడంటే నమ్మలేకున్నా. ఒకవేళ అని ఉంటే మాత్రం వ్యక్తిగతంగా కలిసి మరీ సమాధానం చెబుతా. పృథ్వీ దగ్గర నా ఫోన్ నంబర్ ఉంది. అతడికేమైనా అనుమానాలుంటే తనకు నేరుగా ఫోన్ చేసి అడగొచ్చు. జనసేనకు మేమిచ్చిన విరాళం అధికారికమే’’ అంటూ నాగబాబు స్పష్టం చేశారు.

Follow Us