సానియా మీర్జాను వెంటనే తప్పించండి: రాజాసింగ్

సానియా మీర్జాను వెంటనే తప్పించండి: రాజాసింగ్

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత టెన్నీస్ క్రీడాకారిణి, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ అయిన సానియా మీర్జాపై విమర్శులు ఎక్కువయ్యాయి. పాకిస్థాన్‌కు చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచీ ఆమెపై ట్రోలింగ్ నడుస్తోంది. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని ప్రతిసారీ ఈ విధంగా జరుగుతుంది. సోషల్ మీడియాలో నడిచే ట్రోలింగ్‌తో పాటు రాజకీయంగా కూడా ఆమెకు విమర్శలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆమెను తెలంగాణ రాష్ట్ర […]

Vijay K

| Edited By: Ram Naramaneni

Oct 12, 2020 | 4:53 PM

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత టెన్నీస్ క్రీడాకారిణి, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ అయిన సానియా మీర్జాపై విమర్శులు ఎక్కువయ్యాయి. పాకిస్థాన్‌కు చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచీ ఆమెపై ట్రోలింగ్ నడుస్తోంది. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని ప్రతిసారీ ఈ విధంగా జరుగుతుంది. సోషల్ మీడియాలో నడిచే ట్రోలింగ్‌తో పాటు రాజకీయంగా కూడా ఆమెకు విమర్శలు వస్తున్నాయి.

తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆమెను తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్‌గా తప్పించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పాకిస్థాన్‌ కోడలు మనకు అవసరమా? అంటూ వీడియోలో ప్రశ్నించారు. పాక్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆమె పాక్ కోడలు ఐపోయిందని, అలాంటి వ్యక్తిని మనకు ప్రచారకర్తగా ఎంచుకోవడం సబబేనా అంటూ వెంటనే ఆమెను ఆ బాధ్యత నుంచి తప్పించాలని రాజాసింగ్ కోరారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu