మరొక్క ఏడాదిలో..మారుతీ డీజిల్ కార్లు కనబడవు
ఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేయనుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి తమ నుంచి ఉత్పత్తి అవుతున్న అన్ని మోడళ్లలో డీజిల్ కార్ల అమ్మకాలు జరగవని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ వెల్లడించారు. ప్రస్తుతం దేశీయంగా ఈ సంస్థ అమ్మకాలు జరుపుతున్న కార్లలో దాదాపు 23 శాతం డీజిల్ కార్లే ఉండడం విశేషం. ఇప్పటికే డీజిల్ […]

ఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేయనుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి తమ నుంచి ఉత్పత్తి అవుతున్న అన్ని మోడళ్లలో డీజిల్ కార్ల అమ్మకాలు జరగవని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ వెల్లడించారు. ప్రస్తుతం దేశీయంగా ఈ సంస్థ అమ్మకాలు జరుపుతున్న కార్లలో దాదాపు 23 శాతం డీజిల్ కార్లే ఉండడం విశేషం.
ఇప్పటికే డీజిల్ కార్ల తయారికి ఖర్చ ఎక్కువ అవుతుంది. కష్టమర్స్ ఖర్చును భరించగలిగే వరకూ ఈ తరహా కార్ల ఉత్పత్తి చేస్తామని గతంలోనే మారుతీ ప్రకటించింది. కానీ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్-6 తరహా వాహనాలు మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఈ టెక్నాలజీతో డీజిల్ కార్లను ఉత్పత్తి చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. బీఎస్-6, డీజిల్ వేరియంట్‌లో చిన్న కార్ల ధరలు అత్యధికంగా పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా దీన్ని వినియోగదారులు భరించలేరని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌సీ భార్గవ తెలిపారు. డీజిల్ వేరియంట్ ధరలు పెరిగితే ఏ కార్ల తయారీ సంస్థైనా.. డీజిల్ ఇంజిన్ కార్లను తయారు చేసే సాహసం చేయబోదని భార్గవ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎస్-క్రాస్, సియాజ్, వితారా బ్రెజ్జా, డిజైర్, బాలెనో, స్విఫ్ట్ మోడళ్లు డీజిల్ వేరియంట్‌లోనూ లభిస్తున్నాయి.
