మహాశివరాత్రి: శివ నామస్మరణలో దేవాలయాలు

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌‌‌లోని పంచారామ క్షేత్రాలైన అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరంతో పాటు జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలోని పరమశివుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అలాగే తెలంగాణలోని కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం, నల్గొండ జిల్లాలోని చెర్వుగట్టు, పానగల్, వేములవాడలలో దేవదేవుడికి అర్చలను, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

మహాశివరాత్రి: శివ నామస్మరణలో దేవాలయాలు

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌‌‌లోని పంచారామ క్షేత్రాలైన అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరంతో పాటు జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలోని పరమశివుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అలాగే తెలంగాణలోని కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం, నల్గొండ జిల్లాలోని చెర్వుగట్టు, పానగల్, వేములవాడలలో దేవదేవుడికి అర్చలను, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu