ప్రయాణికుల రాకపోకలపై అంక్షలు ఎత్తివేసిన కువైట్.. ఆ నిబంధనలు పాటించిన వారికి మాత్రమే అనుమతి..!
కువైట్ 35 దేశాల పౌరులు నేరుగా తమ దేశంలో ప్రవేశించడాన్ని గత 7 నెలలుగా నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ నిషేధాన్ని ఎత్తివేసింది.

kuwait resume flights : కరోనా మహమ్మరి ధాటికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు విలవిలలాడాయి. రాకాసి వైరస్ నుంచి రక్షించుకునేందుకు అయా దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ జనం మధ్య భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నాయి. వివిధ దేశాల నుంచి రాకపోకలపై అంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో కువైట్ 35 దేశాల పౌరులు నేరుగా తమ దేశంలో ప్రవేశించడాన్ని గత 7 నెలలుగా నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు గురువారం 35 దేశాల నుండి నేరుగా ప్రయాణికులు కువైట్ వచ్చేందుకు అనుమతించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనను సమర్పించినట్లు ఆరోగ్యశాఖకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది.
అయితే, ఈ 35 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ సొంత ఖర్చులతో 14 రోజుల పాటు హోటళ్లలో క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని ఆరోగ్య స్పష్టం చేసింది. అలాగే, రెండుసార్లు పీసీఆర్ టెస్టు చేయించుకోవల్సి ఉంటుంది. విమానాశ్రయంలో దిగిన వెంటనే ఒకసారి, క్వారంటైన్ గడువు ముగిసిన తర్వార రెండోసారి పీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని కువైట్ అధికారులు సూచించారు. ఇక, గతేడాది ఆగస్టు 1 నుంచి మొదట 31 దేశాలపై బ్యాన్ విధించిన కువైట్.. ఆ తర్వాత ఆఫ్గనిస్థాన్, ఫ్రాన్స్, అర్జెంటీనా, యూకేలను ఈ జాబితాలో చేర్చింది.
ఇదీ చదవండి… RBI Recruitment 2021: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు… ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
