అవి దొ#తున్నాయనే బాబు బాధ… కొడాలి తీవ్ర వ్యాఖ్య

చంద్రబాబు అమరావతి పర్యటన ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న చంద్రబాబుపై ఒక వర్గం రాళ్ళు, చెప్పులు విసిరితే.. మరో వర్గం పూలతో స్వాగతం పలుకుతోంది. మొత్తానికి ఏపీ రాజకీయాలను ఉన్నట్లుండి హీటెక్కించింది చంద్రబాబు పర్యటన. రాజధాని నిర్మాణాలను చూడలేని గుడ్డివాళ్ళు ఏపీ మంత్రులని టిడిపి నేతలు ఆరోపిస్తుంటే.. ఎదురుదాడికి దిగుతున్నారు ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని తదితరులు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు, ఆయన ఆక్రోషానికి కారణం ఇదేనంటూ బాంబు […]

అవి దొ#తున్నాయనే బాబు బాధ... కొడాలి తీవ్ర వ్యాఖ్య
Rajesh Sharma

|

Nov 28, 2019 | 3:17 PM

చంద్రబాబు అమరావతి పర్యటన ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న చంద్రబాబుపై ఒక వర్గం రాళ్ళు, చెప్పులు విసిరితే.. మరో వర్గం పూలతో స్వాగతం పలుకుతోంది. మొత్తానికి ఏపీ రాజకీయాలను ఉన్నట్లుండి హీటెక్కించింది చంద్రబాబు పర్యటన. రాజధాని నిర్మాణాలను చూడలేని గుడ్డివాళ్ళు ఏపీ మంత్రులని టిడిపి నేతలు ఆరోపిస్తుంటే.. ఎదురుదాడికి దిగుతున్నారు ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని తదితరులు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు, ఆయన ఆక్రోషానికి కారణం ఇదేనంటూ బాంబు పేల్చారు ఏపీ మంత్రి కొడాలి నాని. అయిదేళ్ళపాటు గ్రాఫిక్స్ మాయాజాలంతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు.. రాజధాని పర్యటనతో కొత్త నాటకానికి చంద్రబాబు తెరలేపారని కొడాలి నాని ఆరోపిస్తున్నారు. రాజధాని పేరిట అయిదేళ్ళు మాటలతో కాలయాపన చేసిన చంద్రబాబు తన నిజస్వరూపం తేలిపోతుందనే భయంతోనే తాజాగా పర్యటన పేరిట డ్రామాలు చేస్తున్నారని నాని అంటున్నారు.

రాజధాని పేరిట రైతుల నుంచి లాక్కున్న భూములు, తన వారికి పంచిన భూములు దొ#తున్నాయనే దుగ్ధతోనే చంద్రబాబు రంగంలోకి దిగారని సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. ఒకవేళ వైసీపీ నేతలే అడ్డుకోవాలని పిలుపునిస్తే చంద్రబాబు అమరావతిలో అడుగైనా మోపే వారా అని సవాల్ చేశారాయన. అసలే రాజధాని అంశం రాజకీయాలను షేక్ చేస్తోంది. ఈ సమయంలో చంద్రబాబుపై కొడాలి నాని చేసిన తీవ్ర వ్యాఖ్యలు మాటల యుద్దాన్ని నెక్ట్స్ లెవెల్‌కు చేర్చాయనే చెప్పాలి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu