తెలుగు రాష్ట్రాలకు బ్యాడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. ఇప్పట్లో అవి లేనట్లే ఇక..!

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్‌న్యూస్‌ చెప్పిందా.. ? అంటే అవుననే తెలుస్తోంది కేంద్ర మంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి అసెంబ్లీ సీట్ల పెంపుపై ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో అసెంబ్లీ సీట్ల పెంపు లేనట్టేనంటూ దాదాపుగా ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఏపీ విభజన చట్టం ప్రకారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెం‍బ్లీ సీట్ల పెంపుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ […]

తెలుగు రాష్ట్రాలకు బ్యాడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. ఇప్పట్లో అవి లేనట్లే ఇక..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 28, 2020 | 4:10 AM

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్‌న్యూస్‌ చెప్పిందా.. ? అంటే అవుననే తెలుస్తోంది కేంద్ర మంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి అసెంబ్లీ సీట్ల పెంపుపై ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో అసెంబ్లీ సీట్ల పెంపు లేనట్టేనంటూ దాదాపుగా ఓ క్లారిటీ ఇచ్చేసింది.

ఏపీ విభజన చట్టం ప్రకారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెం‍బ్లీ సీట్ల పెంపుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా అసెంబ్లీ సీట్ల పెంపు జరిగినప్పుడే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ చట్టం ప్రకారం.. ప్రత్యేకంగా రెండు రాష్ట్రాల్లోనే అసెంబ్లీ సీట్లను పెంచడానికి అవకాశం లేదన్నారు.

ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన సమయంలో అప్పటి ప్రభుత్వం.. విభజన చట్టంలో ఇష్టారీతిన అనేక అంశాలు పెట్టారన్నారు. రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై న్యాయ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.  అయితే జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాలపై పెంపుపై మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని