AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలేజీలో లవర్‌ని కలిసేందుకు యువకుడు చేసిన పని..

ఇంజనీరింగ్ కళాశాలలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. ప్రిన్స్ పాల్, సిబ్బందిని బెదిరించాడు. కాలేజీలో చదువుకుంటున్న ప్రియురాలితో మాట్లాడేందుకు వీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాలేజీలో రచ్చ చేశాడు.. ఎట్టకేలకు యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

కాలేజీలో లవర్‌ని కలిసేందుకు యువకుడు చేసిన పని..
Jyothi Gadda
|

Updated on: Feb 28, 2020 | 4:40 PM

Share

ఇంజనీరింగ్ కళాశాలలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. ప్రిన్స్ పాల్, సిబ్బందిని బెదిరించాడు. కాలేజీలో చదువుకుంటున్న ప్రియురాలితో మాట్లాడేందుకు వీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రచ్చరచ్చ చేశాడు.. ఎట్టకేలకు యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు.

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినిని కలిసేందుకు ఖమ్మంకు చెందిన ఉదయ్ కిరణ్ అనే యువకుడు నానా హంగామా చేశాడు. హైదరాబాద్ లో సిఎ చదువుతున్న సదరు యువకుడు తన ప్రేమించిన అమ్మాయిని కలిసేందుకు ఓ ప్లాన్ వేసుకున్నాడు. అందుకోసం రా సంస్థకు చెందిన ఆఫీసర్ గా నకిలీ ఐడెంటి కార్డును తయారు చేసుకున్నాడు. దాంతో కార్డు చూపించి కాలేజీలో ప్రవేశించిన యువకుడు ప్రిన్సిపల్ ని కలిశాడు. తన ప్రేమిస్తున్న అమ్మాయిని బయటికి పంపించాలని కోరాడు. ప్రిన్సిపల్ పర్మిషన్ ఇవ్వకపోవటంతో నకిలీ ఐడీ కార్డు చూపించి వారిపై బెదిరింపులకు పాల్పడ్డాడు.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది యువకుడి ఐడీ కార్డుపై విచారణ చేపట్టగా అది నకిలీ ఐడి కార్డుగా తేలింది. సిబ్బంది ప్రశ్నలకు యువకుడు తడబడుతూ సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా..తను ప్రేమించిన యువతిని కలిసేందుకే నకిలీ రా ఆఫీసర్ గా వచ్చినట్లుగా ఒప్పుకున్నాడు. అతడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. నకిలీ ఐడీ కార్డులు తయారు చేస్తున్నవారిపై కూడా కేసులు నమోదు చేశారు.

Follow Us
వాస్తు ప్రకారం ఈ మొక్కలకు అంత పవర్ ఉందా?
వాస్తు ప్రకారం ఈ మొక్కలకు అంత పవర్ ఉందా?
జిగురు అస్సలు ఉండదు.. పెరుగుతో బెండకాయ కూర ఇలా చేస్తే అదిరిపోద్ది
జిగురు అస్సలు ఉండదు.. పెరుగుతో బెండకాయ కూర ఇలా చేస్తే అదిరిపోద్ది
శుక్రుడి అనుగ్రహంతో వీరికి ఆర్థికంగా, కెరీర్‌లో పురోగతి..!
శుక్రుడి అనుగ్రహంతో వీరికి ఆర్థికంగా, కెరీర్‌లో పురోగతి..!
తులసి మాల వేసుకుంటే ఈ 2 ఆహారాలకు దూరంగా ఉండాలా?
తులసి మాల వేసుకుంటే ఈ 2 ఆహారాలకు దూరంగా ఉండాలా?
అక్కడ మెడల్ సాధిస్తే ఆ ఫీలింగే వేరు.. దేశం కోసం ఆడతానన్న బిష్ణోయ్
అక్కడ మెడల్ సాధిస్తే ఆ ఫీలింగే వేరు.. దేశం కోసం ఆడతానన్న బిష్ణోయ్
ఈ చిన్నోడు పాన్ ఇండియా స్టార్.. 2490 కోట్ల ఆస్తి తగ్గినా కింగే.
ఈ చిన్నోడు పాన్ ఇండియా స్టార్.. 2490 కోట్ల ఆస్తి తగ్గినా కింగే.
శత్రువును ఎదుర్కోవాలంటే.. ఈ 7 వ్యూహాత్మక అస్రాలు మీకు తెలియాలి!
శత్రువును ఎదుర్కోవాలంటే.. ఈ 7 వ్యూహాత్మక అస్రాలు మీకు తెలియాలి!
ట్రాఫిక్ చలాన్లు కట్టట్లేదా? అయితే మీ ఇంట్లో కరెంట్ కట్ అవ్వొచ్చు
ట్రాఫిక్ చలాన్లు కట్టట్లేదా? అయితే మీ ఇంట్లో కరెంట్ కట్ అవ్వొచ్చు
బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే.. అతడి అకౌంట్లోని డబ్బులు ఏమవుతాయి..?
బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే.. అతడి అకౌంట్లోని డబ్బులు ఏమవుతాయి..?
'నువ్వు ఆర్టిస్టువా లేక కవయిత్రివా?' UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
'నువ్వు ఆర్టిస్టువా లేక కవయిత్రివా?' UPSC ఇంటర్వ్యూ ప్రశ్న