కరోనా ‘కాటు’.. మలేసియా టు కేరళ.. కన్ననూర్ జిల్లా వాసి మృతి

మలేసియా నుంచి కేరళ చేరుకున్న ఓ వ్యక్తి కరోనా (కోవిడ్-19) వ్యాధితో మరణించాడు. ఇతడ్ని 36 ఏళ్ళ జైనేష్ గా గుర్తించారు. మలేసియాలో రెండున్నర సంవత్సరాలుగా పని చేస్తున్న ఈ వ్యక్తి ఇటీవల కేరళ చేరుకున్నాడు.

కరోనా 'కాటు'.. మలేసియా టు కేరళ.. కన్ననూర్ జిల్లా వాసి మృతి
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 29, 2020 | 3:41 PM

మలేసియా నుంచి కేరళ చేరుకున్న ఓ వ్యక్తి కరోనా (కోవిడ్-19) వ్యాధితో మరణించాడు. ఇతడ్ని 36 ఏళ్ళ జైనేష్ గా గుర్తించారు. మలేసియాలో రెండున్నర సంవత్సరాలుగా పని చేస్తున్న ఈ వ్యక్తి ఇటీవల కేరళ చేరుకున్నాడు. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన జైనేష్.. విపరీతమైన జ్వరం, దగ్గు, ఆయాసంతో బాధ పడుతుండగా.. అతడ్ని వెంటనే ఎర్నాకులం జిల్లా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి

ఐసొలేషన్ వార్డులో చేర్చారు. ఇతనికి మొదట కరోనా నెగెటివ్ లక్షణాలు ఉన్నట్టు కనబడ్డాయి. అయితే న్యుమోనియాతో కూడా బాధపడుతూ,, డయాబెటిస్ సైతం ఉన్న ఈ వ్యక్తికి సంబంధించిన రెండో శాంపిల్ టెస్ట్ రిపోర్టు కూడా రాకముందే మృతి చెందాడు. కన్ననూర్ జిల్లాకు చెందిన జైనేష్.బ్లడ్ ని వైరాలజీ ఇన్స్ టి ట్యూట్ కి పంపగా..  ఈ తాజా టెస్టులో.. ఈయనకు  స్వైన్ ఫ్లూ తో బాటు కరోనా కూడా సోకినట్టు గుర్తించారు. ఈ వ్యక్తి మృతితో ముఖ్యంగా ఎర్నాకులం జిల్లాలో  17 మందిని అబ్జర్వే షన్ లో ఉంచారు. మరో 27 మందిని  వారి ఇళ్లలో 14 రోజుల పాటు వైద్య సంబంధ నిఘాలో ఉంచినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆ మధ్య చైనా లోని వూహాన్ నుంచి కేరళ చేరుకున్న ముగ్గురికి కరోనా సోకినట్టు అనుమానించి ఆసుపత్రులకు తరలించారు. అయితే ఆ ముగ్గురూ కోలుకుని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. తాజా కేసుతో రాష్ట్రం అప్రమత్తమైంది.

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..