అసలు రాజకీయాల్లోకి ఎందుకొచ్చానంటే? పవన్ కల్యాణ్ సీక్రెట్ వెల్లడి

అసలు రాజకీయాల్లోకి ఎందుకొచ్చానంటే? పవన్ కల్యాణ్ సీక్రెట్ వెల్లడి

అయిదున్నరేళ్ళ క్రితం పార్టీని పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇన్నాళ్ళకు తాను ఎందుకు పార్టీ పెట్టానో క్లారిటీ ఇచ్చారు. 2014 ఎన్నికలకు ముందు పార్టీని, పార్టీ పేరును ప్రకటించిన పవన్ కల్యాణ్.. ఆనాటి ఎన్నికల్లో కేవలం బిజెపి,టిడిపి అనుకూల ప్రచారానికే పరిమితమైన సంగతి తెలసిందే. ఆ తర్వాత మూడేళ్ళ పాటు సినిమాలకే పరిమితమైన పవర్ స్టార్… అఙ్ఞాత వాసి సినిమా సూపర్ ఫ్లాప్ తర్వాత సినిమాలను పక్కన పెట్టేసి… రాజకీయాల్లోనే యాక్టివ్ అయ్యారు. రాష్ట్రంలో విస్తృతంగా […]

Rajesh Sharma

|

Dec 03, 2019 | 6:07 PM

అయిదున్నరేళ్ళ క్రితం పార్టీని పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇన్నాళ్ళకు తాను ఎందుకు పార్టీ పెట్టానో క్లారిటీ ఇచ్చారు. 2014 ఎన్నికలకు ముందు పార్టీని, పార్టీ పేరును ప్రకటించిన పవన్ కల్యాణ్.. ఆనాటి ఎన్నికల్లో కేవలం బిజెపి,టిడిపి అనుకూల ప్రచారానికే పరిమితమైన సంగతి తెలసిందే. ఆ తర్వాత మూడేళ్ళ పాటు సినిమాలకే పరిమితమైన పవర్ స్టార్… అఙ్ఞాత వాసి సినిమా సూపర్ ఫ్లాప్ తర్వాత సినిమాలను పక్కన పెట్టేసి… రాజకీయాల్లోనే యాక్టివ్ అయ్యారు. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. తాను స్వయంగా భీమవరం, గాజువాకల్లో పోటీ చేసి, రెండు చోట్ల ఓటమి పాలయ్యారు.

అయితే.. ఆ ఓటమితో ఏ మాత్రం కుంగిపోని పవన్ కల్యాణ్… రాజకీయాల్లోనే తన భవిష్యత్తును తేల్చుకుంటానంటూ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. మంగళవారం తిరుపతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీ పెట్టడాన్ని దుస్సాహసంతో పోల్చిన జనసేనాని, తాను అన్నింటికీ సిద్ద పడి, తెగించే రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించారు. దేశం కోసం చచ్చిపోయేందుకు సిద్ధమేనన్న పవన్ కల్యాణ్.. ప్రస్తుతం దేశానికి అమిత్‌షా లాంటి వ్యక్తులే కరెక్టని అభిప్రాయపడ్డారు.

కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని వాడుకుని రాజకీయ పార్టీలు అభివృద్ధి చెందుతున్నాయని పవన్ సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ‘‘ ఓటమి, గెలుపు రెండూ నాకు తెలియదు.. మనస్సాక్షే నాకు భగవంతుడు‘‘ అంటూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు జనసేనాని. నిస్సాహాయత వల్లనే సంస్థాగతంగా పార్టీ కమిటీలు వేయలేక పోయానని అంగీకరించారాయన. కొన్ని నెలలు జైలులో ఉండి, రోడ్డుపై నడిచి జగన్ రెడ్డి సీఎం అయ్యారని, నాకున్న మొండి తనంతో లక్ష్యాన్ని చేరుకోలేనా అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్.

‘‘150 మంది ఎమ్మెల్యేలకు, సీఎం జగన్ రెడ్డికి ఆస్తులపై, ప్రాణంపై తీపి ఉంది.. అది నాకు లేదు అందుకే రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, హైకోర్టు బెంచ్‌పై కచ్చితంగా మాట్లాడుతాను ‘‘ కుండ బద్దలు కొట్టారు పవన్ కల్యాణ్. రాష్ట్ర విభజన తర్వాత తనకు ప్రాంతీయ భావన పెరిగిందని క్లారిటీ ఇచ్చారు జనసేనాని.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu