భారత్-పాక్‌లు అణ్వస్త్ర దేశాలు కాదు: చైనా

బీజింగ్: భారత్-పాకిస్తాన్‌లు అణ్వస్త్ర దేశాలు కాదంటోంది చైనా. ఆ రెండు దేశాలను అణ్వస్త్ర దేశాలుగా తాము గుర్తించలేదని చెబుతోంది. భారత్, పాక్‌ల మాదిరిగానే నార్త్ కొరియాను కూడా అణ్వస్త్ర దేశంగా గుర్తిస్తారా? అన్న ఒక విలేఖరి ప్రశ్నకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లూకాంగ్ బదులిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు కూడా అణ్వాయుధాలు కలిగి ఉన్నాయని, యుద్ధం జరగడం మంచిది కాదని […]

భారత్-పాక్‌లు అణ్వస్త్ర దేశాలు కాదు: చైనా
Follow us

|

Updated on: Mar 02, 2019 | 11:21 AM

బీజింగ్: భారత్-పాకిస్తాన్‌లు అణ్వస్త్ర దేశాలు కాదంటోంది చైనా. ఆ రెండు దేశాలను అణ్వస్త్ర దేశాలుగా తాము గుర్తించలేదని చెబుతోంది. భారత్, పాక్‌ల మాదిరిగానే నార్త్ కొరియాను కూడా అణ్వస్త్ర దేశంగా గుర్తిస్తారా? అన్న ఒక విలేఖరి ప్రశ్నకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లూకాంగ్ బదులిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు కూడా అణ్వాయుధాలు కలిగి ఉన్నాయని, యుద్ధం జరగడం మంచిది కాదని పలు వార్తలొచ్చాయి. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సైతం అణ్వాయుధాల గురించి ప్రస్తావించారు. పాక్ ఓ బాంబు వేస్తే భారత్ 20 బాంబులు వేస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చైనా చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.