చెప్పింది అమ్మే కదా.. ఇంతలోనే ఎంత పనిచేశావ్ తల్లి..
ప్రస్తుత కాలంలో.. ఓపిక, సహనం అనేది లేకుండా పోతుంది.. కొంతమంది యువతీ, యువకులు.. తల్లిదండ్రులు తమ మంచి కోసమే చెబుతున్నారు అనే ఆలోచన మరిచి.. ప్రాణాలు తీసుకుంటున్నారు. వారు ఎందుకు చెబుతున్నారో ఆలోచించకుండా.. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నారు.

ప్రస్తుత కాలంలో.. ఓపిక, సహనం అనేది లేకుండా పోతుంది.. కొంతమంది యువతీ, యువకులు.. తల్లిదండ్రులు తమ మంచి కోసమే చెబుతున్నారు అనే ఆలోచన మరిచి.. ప్రాణాలు తీసుకుంటున్నారు. వారు ఎందుకు చెబుతున్నారో ఆలోచించకుండా.. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నారు. తాజాగా.. క్షణికావేశం.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. తల్లిదండ్రులు మందలించేది మన మంచి కోసమే అని గ్రహించలేక పోయింది ఆ యువతి.. ఫోన్ కంటే ప్రాణం ముఖ్యం అనే విషయాన్ని మరిచిపోయింది.. ఫోన్ ఎక్కువగా వాడవద్దు అని తల్లి మందలించినందుకు ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.. ఈ షాకింగ్ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది..
వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం ముత్తాయిపల్లిలో గ్రామానికి చెందిన సంగేమ్ శంకర్- సుజాత దంపతులకు ఇద్దరు సంతానం..పెద్ద కుమార్తె శిరీష (19) ఆదివారం ఇంట్లో ఫోన్ లో గేమ్స్ ఆడుతుండగా తల్లి సుజాత గమనించి మందలించింది. ఫోన్ ఎక్కువగా వాడొద్దని.. ఎందుకు ఇలా చేస్తావంటూ మందలించింది.. దీంతో తల్లి కూతురికి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన శిరీష ఇంట్లో ఉన్న ఎలుకల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది.
దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. కేవలం ఫోన్ ఎక్కువగా వాడవద్దు అని చెప్పినందుకు శిరీష ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
