పోలీసుల విషయంలో జాగ్రత్త.. రాష్ట్రాలకు హోం శాఖ హెచ్చరిక
పోలీసు సిబ్బంది విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో క్రిటికల్ పరిస్థితుల్లో విధి నిర్వహణ చేస్తున్న పోలీసు సిబ్బంది కరోనా బారిన పడుతుండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ భావిస్తోంది.
పోలీసు సిబ్బంది విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో క్రిటికల్ పరిస్థితుల్లో విధి నిర్వహణ చేస్తున్న పోలీసు సిబ్బంది కరోనా బారిన పడుతుండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఈమేరకు ప్రత్యామ్నాయ ప్రణాళికలతో రాష్ట్రాలన్నీ సిద్ధం కావాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ రాష్ట్ర డీజీపీలకు లేఖ రాసినట్లు సమాచారం.
కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి సుదీర్ఘకాలం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందని హోంశాఖ భావిస్తోంది. లాక్‌డౌన్ మరో నెల, రెండు నెలలు కొనసాగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిస్థితులను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర డిజిపిలకు హోంశాఖ సూచించింది. పోలీసు సిబ్బందిని రెండుగా విభజించి వారిలో కొంతమందిని విధినిర్వహణలో ఉంచాలని, మరికొందరిని స్టాండ్‌బై గా వుంచి.. వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలని హోంశాఖ సూచించింది. ఈ మేరకు సెకండ్ లైన్ భద్రతా సిబ్బందిని విధి నిర్వహణ కోసం సిద్ధం చేయాలని ఈ పాండమిక్ సిచ్యువేషన్‌ని ఎదుర్కొనడానికి రాష్ట్ర పోలీసు విభాగాలు ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధం కావాలని కేంద్ర హోంశాఖ తెలిపింది.