బాలయ్యకు హైకోర్టు నోటీసులు

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు బాలయ్యకు ఈ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ పిటిషన్‌లో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా నంద్యాల ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహిస్తూ బాలకృష్ణ ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారని, […]

బాలయ్యకు హైకోర్టు నోటీసులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:31 PM

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు బాలయ్యకు ఈ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ పిటిషన్‌లో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

కాగా నంద్యాల ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహిస్తూ బాలకృష్ణ ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారని, ఆయనపై ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ వైసీపీ అప్పటి ప్రధాన కార్యదర్శి కె. శివ కుమార్ ఆగష్టు 2017లో హైకోర్టులో ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన విషయంలో బాలకృష్ణపై కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.