భద్రాద్రి దేవస్థాన ఈవో కుమారుడుపై వేధింపుల కేసు
భద్రాద్రి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్ బాబు, ఆయన కుటుంబసభ్యులపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. పెళ్లయిన వారం రోజుల నుంచి తనను వేధింపులకు గురి చేస్తున్నారని.. అదనపు కట్నం కోసం హింసిస్తున్నారని రమేష్ బాబు కోడలు సింధూర సత్తుపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసింది. మానసిక వ్యాధితో బాధపడుతున్న తన కుమారిడి ఆరోగ్య పరిస్థితిని దాచిపెట్టి, రమేష్ బాబుతో వివాహం చేశారని, అప్పటి నుంచీ భర్త, అత్తమామలు, ఆడపడుచులు నరకంలతో చూస్తున్నానని ఆరోపించింది సింధూర. రమేష్ […]
భద్రాద్రి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్ బాబు, ఆయన కుటుంబసభ్యులపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. పెళ్లయిన వారం రోజుల నుంచి తనను వేధింపులకు గురి చేస్తున్నారని.. అదనపు కట్నం కోసం హింసిస్తున్నారని రమేష్ బాబు కోడలు సింధూర సత్తుపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసింది. మానసిక వ్యాధితో బాధపడుతున్న తన కుమారిడి ఆరోగ్య పరిస్థితిని దాచిపెట్టి, రమేష్ బాబుతో వివాహం చేశారని, అప్పటి నుంచీ భర్త, అత్తమామలు, ఆడపడుచులు నరకంలతో చూస్తున్నానని ఆరోపించింది సింధూర. రమేష్ బాబు కుటుంబం వల్ల తనకు ప్రాణహాని ఉందని కన్నీటి పర్యంతమయింది.
భద్రాద్రి దేవస్థాన ఈవో రమేష్ బాబు కుమారుడు అనంత్ నాగ్ కు గతేడాది ఏప్రిల్ 19న సత్తుపల్లికి చెందిన సింధూరతో వివాహం జరిగింది. అనంత్ నాగ్ ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడని.. బాగా చదువుకున్నాడని చెప్పి తన పెళ్లి చేశారని అంటోంది సింధూర. అయితే పెళ్లయిన వారం రోజులకే అనంత్ నాగ్ నిజస్వరూపం బయపడిందని తెలిపింది. మానసిక జబ్బుతో బాధపడుతున్న తన భర్త కూకట్ పల్లిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పింది సింధూర. పగలంతా మెడిసిన్స్ వేసుకుని పడుకుని.. రాత్రుళ్లు మద్యం సేవించి రోడ్లపై తిరుగుతాడని ఆవేదన వ్యక్తం చేసింది. అకారణంగా తనను కొట్టేవాడని.. ఈ విషయాలు బయట పెట్టకుండా రమేష్ బాబు తన పలుకుబడితో అడ్డుకున్నారని ఆరోపిస్తుంది.