High alert ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులో హై అలర్ట్

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి తమిళనాడుకు కలిపి అన్ని రోడ్లను దాదాపు సీజ్ చేశారు. అనుమతులున్న, అత్యవసర వాహనాలను తప్పించి రెగ్యులర్ రవాణాను పూర్తిగా నియంత్రించారు.

High alert ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులో హై అలర్ట్
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 21, 2020 | 1:29 PM

High alert near Andhra, Tamilnadu border: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి తమిళనాడుకు కలిపి అన్ని రోడ్లను దాదాపు సీజ్ చేశారు. అనుమతులున్న, అత్యవసర వాహనాలను తప్పించి రెగ్యులర్ రవాణాను పూర్తిగా నియంత్రించారు. ఏపీ నుంచి తమిళనాడుకు వెళ్ళే వాహనాలను తమిళనాడు అధికారులు నిలువరిస్తుండగా… అటు నుంచి ఇటు వచ్చే వాహనాలను ఆంధ్ర ప్రదేశ్ అధికారులు అనుమతించడం లేదు.

కరోనా వైరస్ కలకలంతో ఆంధ్ర నుండి వచ్చే వాహనాలను వెల్లూర్ జిల్లాలో నిలిపివేశారు. ఆంధ్ర నుండి వచ్చే అన్ని ప్రైవేట్ వాహనాలను అడ్డుకుంటున్నారు. నిత్యావసరాలకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా ఆంధ్ర నుండి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించడానికి సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక వైద్య బృందాలను నియమించారు.

తమిళనాడు నుండి తిరుపతి మీదుగా చిత్తూరు,కడప జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను , బస్సులను రద్దు చేశారు అధికారులు. ఆంధ్ర నుండి తమిళనాడుకు జరిపే ప్రయాణాలను రద్దు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చే వాహనాలను ఏపీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. విదేశాల నుంచి ఇటీవల వచ్చిన వివరాలను ప్రశ్నిస్తున్నారు.