AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao warns ముందుంది ముసళ్ళ పండగ… హరీశ్ వార్నింగ్ ఎవరికి?

కరోనా నేపథ్యంలో తీసుకున్న చర్యలు, మరీ ముఖ్యంగా సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా వుంటాయంటున్నారు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు. యావత్ దేశం సుదీర్ఘ కాలంపాటు ఆర్థిక సంక్షోభానికి సిద్దం కావాల్సిన పరిస్థితి కనిపిస్తుందంటున్నారు హరీశ్.

Harish Rao warns ముందుంది ముసళ్ళ పండగ... హరీశ్ వార్నింగ్ ఎవరికి?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Apr 06, 2020 | 3:05 PM

Share

Harish Rao warns about post lack-down period: కరోనా నేపథ్యంలో తీసుకున్న చర్యలు, మరీ ముఖ్యంగా సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా వుంటాయంటున్నారు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో లాక్ డౌన్ కొనసాగుతుండడం, కరోనా భయంతో పలు ఆంక్షలు విధించడం.. భవిష్యత్తులో విపరీత పరిస్థితిని సృష్టించబోతున్నాయని హరీశ్ రావు అంఛనా వేస్తున్నారు.

సోమవారం హరీశ్ రావు రాబోయే కాలంలో తలెత్తబోయే ఆర్థిక పరిణామాలపై మాట్లాడారు. కరోనా తర్వాత ఆర్థిక సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా పొంచి ఉందని ఆయనన్నారు. దాని ప్రభావం ఎంత ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేమని అంటున్న హరీశ్ రావు.. కరోనా వైరస్ విషయంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి నిర్ణయాలు తీసుకున్నారని చెబుతున్నారు. 14వ తారీఖు వరకు కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందని ఆశిస్తున్నామని, అప్పటి వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండి సహకరించాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

ఇబ్బందుల్లో వున్న వారందరినీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని, మే నెలలో కూడా ఆదాయాలు వచ్చే అవకాశం లేదని హరీశ్ రావు అంటున్నారు. అయినా ప్రజాసంక్షేమానికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు జీతాల కోతలు విధించలేదని… కేవలం వాయిదా మాత్రమే వేశామని ఆయన వివరించారు. ప్రజలు ఇళ్ళల్లో ఉండే ఈ అవకాశాన్ని పిల్లల్లో సామాజిక స్పృహను పెంచే విధంగా ఉపయోగించుకోవాలని హరీశ్ సూచించారు. లాక్ టౌన్ సమయంలో ప్రజల్లో కొంత మార్పు కనిపిస్తుందని, చాలా కుటుంబాల్లో, గ్రామాల్లో ఐకమత్యం పెరిగిందని హరీశ్ రావు అంటున్నారు.