AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీరు మారని చైనా.. ఇంకా అవే తింటున్నారు !

కరోనా వైరస్ వ్యాప్తితో అతలాకుతలమైనట్లు కనిపించిన చైనాలో, ముఖ్యంగా చైనీయుల్లో పెద్దగా మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. మహమ్మారి కరోనా జన్మకు కారణమైన తమ ఆహారపు అలవాట్లను మార్చుకునేందుకు ఏ మాత్రం రెడీగా లేరని..

తీరు మారని చైనా.. ఇంకా అవే తింటున్నారు !
Rajesh Sharma
|

Updated on: Apr 06, 2020 | 2:16 PM

Share

China not yet learnt from Corona pandemic: కరోనా వైరస్ వ్యాప్తితో అతలాకుతలమైనట్లు కనిపించిన చైనాలో, ముఖ్యంగా చైనీయుల్లో పెద్దగా మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. మహమ్మారి కరోనా జన్మకు కారణమైన తమ ఆహారపు అలవాట్లను మార్చుకునేందుకు ఏ మాత్రం రెడీగా లేరని తాజాగా చైనాలో నెలకొన్న పరిస్థితులను బట్టి తెలుస్తోంది.

కరోనా వ్యాప్తిని దాదాపుగా కట్టడి చేసిన చైనా ప్రభుత్వం ప్రజలపై విధించిన ఆంక్షలను తొలగించింది. రెండు నెలల కట్టడి తర్వాత దొరికి స్వేచ్ఛతో రెచ్చిపోయిన చైనీయులు పెద్ద ఎత్తున మార్కెట్లపై పడ్డారు. పళ్ళు, కూరగాయలు, మిగిలిన నిత్యావసర వస్తువులను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇక్కడి వరకు బాగానే వున్నా.. అసలు కరోనా వైరస్ పుట్టుకకు కారణమని భావిస్తున్న ఆహారపు అలవాట్లను వారు వదులుకోవడం లేదు. ముఖ్యంగా గబ్బిలాల నుంచే కరోనా వ్యాప్తి మొదలైందని చాలా మంది విశ్వసిస్తుంటే.. చైనీయులు మాత్రం వాటిని తినేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.

ఆంక్షల ఎత్తివేత తర్వాత మార్కెట్ల మీద పడ్డ చైనీయులు పెద్ద ఎత్తున గబ్బిలపు మాంసాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తమ సంప్రదాయ ఆహారాలైన పిల్లులు, కుక్కలు, పాములు, బొద్దింకలను తినేందుకు చైనీయులు పోటీ పడుతున్నారని తెలుస్తోంది. చైనీయుల ఆహారపు అలవాట్లే యావత్ ప్రపంచానికి పెను ప్రమాదాన్ని తెచ్చిందని భావిస్తున్న ఆస్ట్రేలియన్ పాలకులు.. చైనా ఆహారపు అలవాట్లపై నిషేధం విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ను కోరారు. చైనీయుల ఆహారపు అలవాట్లను చూస్తున్న ప్రతీ ఒక్కరు.. ‘‘థూ.. వీళ్ళు మారరా?’’ అనుకుంటున్నారు.