AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖ్యమంత్రుల కమిటీ సిఫార్సుల మేరకే కొత్త వ్యవసాయ బిల్లు : లక్ష్మణ్

తడి బట్టతో రైతుల గొంతు కోసే కేసీఆర్ కు వ్యవసాయ బిల్లుపై మాట్లాడే అర్హత లేదని బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ముఖ్యమంత్రుల కమిటీ సిఫార్సులే కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టంలో ఉన్నాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. భూసార పరీక్షల కోసం కేంద్రం రాష్ట్రానికిచ్చిన 125 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో కేసీఆర్ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. దాళారీలు, కమిషన్ ఏజెంట్లకు కొమ్ముకాసేలా […]

ముఖ్యమంత్రుల కమిటీ సిఫార్సుల మేరకే కొత్త వ్యవసాయ బిల్లు : లక్ష్మణ్
Venkata Narayana
|

Updated on: Sep 21, 2020 | 3:19 PM

Share

తడి బట్టతో రైతుల గొంతు కోసే కేసీఆర్ కు వ్యవసాయ బిల్లుపై మాట్లాడే అర్హత లేదని బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ముఖ్యమంత్రుల కమిటీ సిఫార్సులే కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టంలో ఉన్నాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. భూసార పరీక్షల కోసం కేంద్రం రాష్ట్రానికిచ్చిన 125 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో కేసీఆర్ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. దాళారీలు, కమిషన్ ఏజెంట్లకు కొమ్ముకాసేలా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు. రైతులను దోచుకోవటానికున్న రాజమార్గం మూసుకుపోతోందని టీఆర్ఎస్ కు బాధగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కొత్త వ్యవసాయ చట్టంతో రైతుల ఆదాయం రెట్టింపవుతుందని వెల్లడించారు. కొత్త వ్యవసాయ చట్టంతో యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారని.. దేశ భవిష్యత్ కు వ్యవసాయ చట్టం పునాది లాంటిదని తెలిపారు. రైతు ఆత్మహత్యలకు కారణమవుతోన్న పత్తి పంటను కేసీఆర్ ప్రోత్సహించటం సరైంది కాదన్నారు. 40 లక్షల ఎకరాల పత్తి పంటను సీఎం కేసీఆర్ 70 లక్షల ఎకరాలకు తీసుకెళ్ళారని లక్ష్మణ్ తప్పుబట్టారు.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి