‘బైపోలార్ అఫెక్టివ్ డిజార్డర్’ సోకితే కరుణ, దయనీయగుణం ఎందుకు..?

వ్యాపారవేత్త, రియాలిటీ టెలివిజన్ స్టార్ కిమ్ కర్దాషియాన్ తన భర్త బిలియనీర్ రాపర్ కాన్యే వెస్ట్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని.. ఇటీవల అతనికి బైపోలార్ డిజార్డర్ ఉందని ఆమె వెల్లడించింది. రాపర్ కాన్యే కు ముంబైకి చెందిన పరిశోధకుడు, డాక్టర్ సదాఫ్ విధా చికిత్స అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

'బైపోలార్ అఫెక్టివ్ డిజార్డర్' సోకితే కరుణ, దయనీయగుణం ఎందుకు..?
Follow us

|

Updated on: Jul 24, 2020 | 6:51 PM

వ్యాపారవేత్త, రియాలిటీ టెలివిజన్ స్టార్ కిమ్ కర్దాషియాన్ తన భర్త బిలియనీర్ రాపర్ కాన్యే వెస్ట్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని.. ఇటీవల అతనికి బైపోలార్ డిజార్డర్ ఉందని ఆమె వెల్లడించింది. రాపర్ కాన్యే కు ముంబైకి చెందిన పరిశోధకుడు, డాక్టర్ సదాఫ్ విధా చికిత్స అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

రాపర్ కాన్యే కు కూడా ‘బైపోలార్ అఫెక్టివ్ డిజార్డర్’ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది ఉన్న వారి మానసిక స్థితిలో తీవ్రమైన మార్పులు ఉంటాయని వైద్యులు తెలిపారు. బైపోలార్ డిజార్డర్ ప్రాథమికంగా ఉన్మాదం కలిగి ఉంటుందని హైపోమానియా, నిరాశ అనే రెండు దశలతో కూడిన మూడ్ డిజార్డర్ అని డాక్టర్ సదాఫ్ విధా తెలిపారు.

భావోద్వేగాలు అతిగా ప్రభావితం అయ్యే మానసిక వ్యాధిని బైపోలార్ డిజార్డర్ అంటారు. ఈ వ్యాధి వున్నవారు కొన్ని వారాలు, నెలల పాటు ఉన్మాద స్థితిలో వుండి, మరి కొన్ని వారాలు, నెలల పాటు కృంగుబాటుకు గురవుతుంటారు. ఈ వ్యాధి బారిన పడినవారు విపరీతమైన నిరాశతో కూడిన కృంగుబాటు స్థితికి చేరుకుంటారు. వీరిలో ఎక్కువగా కోపము, చిరాకు, అతిగా సంతోషంతో కూడిన ఉన్మాద స్థితి కూడా ఉంటుంది. శరీరంలో విపరీతమైన ప్రవర్తనల్లో మార్పులు వచ్చి ఉన్మాద స్థితికి చేరుకుంటారు.

బైపోలార్ డిజార్డర్ అనేది గతంలో మానిక్ డిప్రెషన్ అని, ఇది మానసిక ఆరోగ్య పరిస్థితికి కారణమవుతుంది. మయోక్లినిక్ ప్రకారం.. ఆరోగ్యం పూర్తిగా క్షిణించి నిద్ర లేమి, తినే పదార్థాల పట్ల స్పష్టమైన ఇష్టం ఉండకపోవడం శరీరంలో శక్తిని కోల్పోడం జరుగుతుంది. కృంగుబాటు వ్యాధి తో బైపోలార్ డిజార్డర్ అరుదుగా కలుగుతుంది. బైపోలార్ డిజార్డర్ నూటికి ఒక్కరిలో కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బైపోలార్ డిజార్డర్ కొన్ని కుటుంబాలలో ఎక్కువగా కనబడుతుంది, అంటే జన్యుపరమైన కారణాలు ఉంటాయి. వృద్దాప్యంలో కలిగే బైపోలార్ డిజార్డర్ లో జన్యుపరమైన కారణాలు వుండే అవకాశం తక్కువ. కొన్నిసార్లు మెదడులో భావోద్వేగాలకు సంబంధించిన భాగంలో భౌతికంగా సమస్య వుండే అవకాశం వుంది. మానసిక వత్తిడి వలన బైపోలార్ డిజార్డర్ లో కలిగే భావోద్వేగ స్థితులు ప్రభావితం అయ్యే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు.

మానసిక ఆరోగ్య రుగ్మతల మాదిరిగానే ఇది కూడా స్పెక్ట్రంలో సంభవిస్తుంది. భారతదేశంలో ప్రాబల్యం తక్కువగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వెయ్యి జనాభాకు 0.51 నుంచి 20.78 వరకు ఉంటుందని తెలిపారు. భారతదేశంలోని మానసిక ఆరోగ్య వైద్యుల ప్రకారం మహిళల్లో మానసిక రుగ్మతలు ఎక్కువగా ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. మన దేశంలో మానసిక రుగ్మతలను ఒక మచ్చగా భావిస్తున్నారు. అలాంటి సందర్భాలలో ఎక్కువగా నష్టపోతున్నది మహిళలే అని అంటున్నారు నిపుణులు. బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ వెలువరించిన ఒక పరిశోధన వెల్లడించింది.

తమ జీవితంలో ఏదో ఒక సమయంలో డిప్రెషన్‌తో బాధ పడుతుంటారు. దీంతో మీరు మానసిక డిప్రెషన్ కు గురవుతుంటారు. దీన్నే బైపోలార్ డిజార్డర్ వైద్యులు పిలుస్తుంటారు. అయితే చాలా కొద్ది మంది మాత్రమే ప్రొఫెషనల్ సాయం తీసుకుంటారు. ఎందుకంటే భారతదేశంలో మానసిక రుగ్మతలను ఒక సామాజిక కళంకంగా భావిస్తారు.

కృంగుబాటు స్థితిలో వున్న పేషంట్లకు యాంటీ డిప్రెసెంట్స్ తో చికిత్స చేయవలసి వస్తే, చాల జాగ్రత్తగా డోసులు ఇవ్వవలసి ఉంటుంది, లేకపోతే వారిని ఉన్మాద స్థితిలో నెట్టివేసే ప్రమాదం వుంది. కృంగుబాటు స్థితి నుండి బయటకు రాగానే యాంటీ డిప్రెసెంట్స్ ఆపి వేయవలసి ఉంటుంది. ఒకానొక దశలో రాపర్ కాన్యే వెస్ట్ కు విడాకులు ఇచ్చి కిమ్ కర్దాషియాన్ వేరుగా ఉంటుందన్న వార్తలు వచ్చాయి. చివరికి అతని మానసికి స్థితిని అర్థం చేసుకుని తనతో ఉంటున్నట్లు వైద్యులు సదాఫ్ విధా తెలిపారు.

కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?