2000 ఏళ్ల నాటి అమృతాన్ని సమాధిలో గుర్తించిన చైనా

బీజింగ్: 2000 ఏళ్ల సంవత్సరాల నాటి అమృతాన్ని చైనాలో గుర్తించారు. తవ్వకాల్లో ఒక సమాధిలో ఇది దొరికింది. ఒక కాంస్యపు పాత్రలో 3.5 లీటర్ల వరకు ద్రవ రూపంలో ఇది ఉంది. అమరత్వం సిద్ధిస్తుందనే నమ్మకంతో పూర్వం రాజులు ఇలాంటి అమృతాన్ని సేవించేవారు. చనిపోకుండా ఉండేందుకు వీటిని వినియోగించేవారు. ఇప్పుడు దొరికినది ఒక సంపన్న కుటుంబానికి చెందినదిగా పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ద్రవంలో ప్రత్యేకమైన పొటాషియం లవణాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక అమృతం గురించి పుస్తకాల్లో […]

  • Vijay K
  • Publish Date - 2:40 pm, Tue, 5 March 19
2000 ఏళ్ల నాటి అమృతాన్ని సమాధిలో గుర్తించిన చైనా

బీజింగ్: 2000 ఏళ్ల సంవత్సరాల నాటి అమృతాన్ని చైనాలో గుర్తించారు. తవ్వకాల్లో ఒక సమాధిలో ఇది దొరికింది. ఒక కాంస్యపు పాత్రలో 3.5 లీటర్ల వరకు ద్రవ రూపంలో ఇది ఉంది. అమరత్వం సిద్ధిస్తుందనే నమ్మకంతో పూర్వం రాజులు ఇలాంటి అమృతాన్ని సేవించేవారు. చనిపోకుండా ఉండేందుకు వీటిని వినియోగించేవారు. ఇప్పుడు దొరికినది ఒక సంపన్న కుటుంబానికి చెందినదిగా పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ ద్రవంలో ప్రత్యేకమైన పొటాషియం లవణాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక అమృతం గురించి పుస్తకాల్లో మాత్రమే ఇప్పటి వరకూ ఉంది. హన్ రాజ్య వంశీయుల కాలం నాటిదిగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కుండ ఆకారంలో ఉన్న  పాత్రలో దొరికిన ఆ అమృత ద్రావాణాన్ని ఆ సంపన్న కుటుంబం వినియోగించిందా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. బహుశా వినియోగించలేదోమోననే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ పాత్రతో పాటు ఇంకా పలు కుండలు, కాంస్యపు పాత్రలను కూడా ఆ సమాధి నుంచి వెలికి తీశారు. ఈ త్రవ్వకాల్లో బయటపడిన వస్తువల ఆధారంగా అప్పట్లో హన్ వంశీయుల జీవిన విధానంపై పరిశోధనకు ఉపయోగపడుతుందని, అప్పట్లో ఎలా సమాధి చేశావారనే విషయంపై కూడా సమాచారం దొరికినట్లైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.